Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

You Can Now Test Yourself for Covid-19 At Home with Coviself Kit

 

You Can Now Test Yourself for Covid-19 At Home with Coviself Kit

కొవిసెల్ఫ్‌ కిట్‌ తో ఇక ఇంట్లోనే కొవిడ్‌ పరీక్ష - వారం రోజుల్లో ధర రూ.250 తో మార్కెట్లోకి విడుదల

ఐసీఎంఆర్‌ ఆమోదముద్ర

కొవిడ్‌ సోకినట్లు అనుమానం ఉన్నవారు సొంతంగా పరీక్షించుకొనేందుకు వీలుగా పుణెకు చెందిన మైల్యాబ్స్‌ సంస్థ రూపొందించిన ‘కొవిసెల్ఫ్‌’ కిట్‌కు ఐసీఎంఆర్‌ ఆమోదముద్ర వేసింది. రూ.250 ధర నిర్ణయించిన ఈ కిట్‌ మరో వారం రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న 7 లక్షల ఫార్మసీలు, ఆన్‌లైన్‌ ద్వారా మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది. సొంతంగా పరీక్షలు నిర్వహించుకోడానికి ఐసీఎంఆర్‌ అనుమతిచ్చిన మొదటి కిట్‌ ఇదే. దేశంలోని 90% ప్రాంతాలకు ఆన్‌లైన్‌ ద్వారా అందుబాటులోకి తేనున్నట్లు తయారీ సంస్థ పేర్కొంది. దీన్ని ఇంట్లో ఎలా ఉపయోగించాలన్న పూర్తిస్థాయి వివరాలు కిట్‌తోపాటు పొందుపరిచారు. కాబట్టి, ఎవరి సాయం అవసరం లేకుండా ఎవరికివారే పరీక్షలు చేసుకోవచ్చు. ఈ ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షకు ముక్కులోంచి తీసిన తెమడ (స్వాబ్‌) సరిపోతుంది.

పావుగంటలో ఫలితం: మొత్తం పరీక్ష రెండు నిమిషాల్లో పూర్తవుతుంది. ఫలితానికి 15 నిమిషాలు వేచి చూడాల్సి ఉంటుంది.  టెస్ట్‌ కిట్‌లో ‘సి’ అక్షరం దగ్గర ఒక్కటే మార్క్‌ వస్తే నెగెటివ్‌ అన్నట్లు.. సి, టి అక్షరాలు రెండింటి దగ్గరా మార్క్‌ వస్తే పాజిటివ్‌ అన్నట్లు పరిగణించాలి. 20 నిమిషాల తర్వాత ఏ నివేదిక వచ్చినా దాన్ని పరిగణనలోకి తీసుకోకూడదని తయారీదారు పేర్కొన్నారు. మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని టెస్ట్‌కిట్‌పై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి వివరాలు నమోదుచేసి టెస్ట్‌ రిపోర్ట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పలు దేశాల్లో ఇప్పటికే ఇలాంటి స్వీయ పరీక్ష కిట్లు అందుబాటులోకి తెచ్చారు. ఏప్రిల్‌, మే నెలల్లో దేశంలో రెండో ఉద్ధృతి పెరిగిపోవడంతో కరోనా పరీక్ష కేంద్రాలపై విపరీతమైన ఒత్తిడి పెరిగి సకాలంలో పరీక్షలు చేయించుకోలేని, ఫలితాలు అందుకోలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు స్వీయ పరీక్షల కిట్‌ అందుబాటులోకి రావడం వల్ల ఆ సమస్య తీరనుంది. ‘ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షల్లో పాజిటివ్‌ వస్తే 100% పాజిటివ్‌గా నమ్మాల్సి ఉంటుంది. నెగెటివ్‌ వస్తే మాత్రం అది 100% నెగెటివ్‌ కాదు. అప్పటికీ లక్షణాలు కనిపిస్తుంటే ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకోవడం మేలు’ అని ఐసీఎంఆర్‌ పేర్కొంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని వీడియో లింక్‌ https://coviself.com/video/ ద్వారా  తెలుసుకోవచ్చు.

ICMR Approves Home Based RAT KIT - DETAILS

Previous
Next Post »
0 Komentar

Google Tags