Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ICMR Approves Home-Based RAT Kit for Covid Testing

 

ICMR Approves Home-Based RAT Kit for Covid Testing

ఇకపై ఇంటి వద్దే కరోనా పరీక్షలు – ఐసీఎంఆర్ ఆమోదం

 

పల్లెల్లో కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇంటింటికెళ్లి పరీక్షలు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆదేశాల మేరకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్​) కార్యాచరణకు సిద్ధమయింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను బుధవారం రాత్రి విడుదల చేసింది. 

* లక్షణాలు ఉన్నవారు, ఇప్పటికే పాజిటివ్​గా తేలినవారితో సన్నిహిత సంబంధం ఉన్నవారికి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్​ చేయాలి. విచక్షణారహితంగా పరీక్షలు నిర్వహించకూడదు.

* గూగుల్ ప్లేలో ఉన్న హోం టెస్టింగ్ మొబైల్ యాప్ డౌన్​లోడ్ చేసుకుని అందులో పేర్కొన్న నిబంధనలను అనుసరించి పరీక్షలు నిర్వహించాలి. రోగికి పాజిటివ్, నెగెటివ్​ టెస్ట్ ఫలితాలు అందించాలి.

* పరీక్ష ప్రక్రియ పూర్తయిన తర్వాత దానికి ఉపయోగించిన టెస్ట్​ స్ట్రిప్​ను మొబైల్​యాప్​, యూజర్​ రిజిస్ట్రేషన్ చేసిన మొబైల్​ఫోన్​లో ఫోటో తీయాలి.

* మొబైల్​ఫోన్​ యాప్​లో నమోదు చేసిన డేటాను కేంద్రీకృత సర్వర్​లో భద్రంగా నిల్వచేస్తారు. ఈ సర్వర్​ ఐసీఎంఆర్​ కొవిడ్​-19 టెస్టింగ్​ పోర్టల్​కు అనుసంధానమై ఉంటుంది. అంతిమంగా డేటా అంతా ఇందులోనే నిల్వ ఉంటుంది.

* ఈ పరీక్షల్లో పాజిటివ్​ వచ్చిన రోగులంతా 100 శాతం పాజిటివ్​గానే భావించాలి. మరోసారి పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. వారంతా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం ఐసోలేషన్​లో ఉండాలి.

* లక్షణాలు ఉన్నప్పటికీ ర్యాట్​ టెస్టుల్లో నెగెటివ్​ వచ్చిన వారు వెంటనే ఆర్​టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలి. తక్కువ వైరల్ లోడ్ ఉన్నవారిని గుర్తించటంలో ర్యాట్ పరీక్షలు విఫలమయ్యే అవకాశం ఉన్నందున నెగెటివ్ వచ్చిన వారు ఆర్​టీ-పీసీఆర్ పరీక్షలకు వెళ్లాలి.

* లక్షణాలున్నా ఇందులో నెగెటివ్ వచ్చిన వారిని అనుమానిత కొవిడ్ రోగులుగా పరిగణించి వెంటనే ఐసోలేషన్​కు వెళ్లమని చెప్పాలి. ఆర్​టీ-పీసీఆర్ పరీక్ష ఫలితం వచ్చేంతవరకు వారు దాన్ని అనుసరించాలి.

Previous
Next Post »
0 Komentar

Google Tags