Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

PAYTM Users Can Now Book COVID-19 Vaccine Appointments on App

 

PAYTM Users Can Now Book COVID-19 Vaccine Appointments on App

పేటీఎం యాప్‌లో టీకా అపాయింట్‌మెంట్‌ బుకింగ్‌

పేటీఎం యాప్‌లో కొవిడ్‌ టీకా అపాయింట్‌మెంట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ‘పేటీఎం వినియోగదార్లు కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాల కోసం తమకు దగ్గర్లోని కేంద్రాల్లో సమయం బుక్‌ చేసుకునేందుకు యాప్‌ తోడ్పడుతుంద’ని పేటీఎం వెల్లడించింది. టీకా బుకింగ్‌లు ఆఫర్‌ చేసేందుకు పేటీఎం, మేక్‌మైట్రిప్‌, ఇన్ఫోసిస్‌ వంటి 12 సంస్థలు అనుమతులు కోరుతున్నాయని ఇటీవల కొవిన్‌ అధిపతి ఆర్‌ఎస్‌ శర్మ వెల్లడించిన సంగతి తెలిసిందే.

కొవిన్‌ యాప్‌ను థర్డ్‌-పార్టీ అప్లికేషన్స్‌తో సమ్మిళితం చేయడానికి గత నెలలో ప్రభుత్వం నిబంధనలు జారీ చేసింది. ఫేస్‌బుక్‌, గూగుల్‌ వంటి సంస్థలు, హెల్తిఫైమి వంటి అంకురాలు ‘టీకాకు ఎక్కడ అవకాశం ఉందో తెలుసుకునే’ సదుపాయాన్ని కల్పించాయి. అండర్‌45, గెట్‌జాబ్‌ వంటి ప్లాట్‌ఫామ్‌లు అయితే ‘టీకా స్లాట్‌’ ఓపెన్‌ కాగానే తమ వినియోగదార్లకు అలర్ట్‌ పంపించి కొవిన్‌ యాప్‌లో అపాయింట్‌మెంట్‌ తీసుకునేలా చేస్తున్నాయి.

PAYTM - APP

Previous
Next Post »
0 Komentar

Google Tags