Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SonuSood: "SAMBHAVAM” Free IAS Coaching Program - Details Here

 

SonuSood: "SAMBHAVAM” Free IAS Coaching Program - Details Here

సోనూసూద్: సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అవుతోన్న విద్యార్థులకు సంభవం’ పేరుతో ఉచిత శిక్షణ కార్యక్రమం – వివరాలు ఇవే

కరోనా వేళ, దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలతో ప్రజల మనసు చూరగొన్నారు నటుడు సోనూసూద్. తాజాగా సివిల్ సర్వీసెస్‌లో చేరాలనుకునే వారికి అండగా నిలవాలనుకుంటున్నారు. ‘సంభవం’ పేరుతో వారికి ఆర్థికంగా సహకరించేందుకు ముందుకొచ్చారు. ఈ విషయాన్ని నిన్న రాత్రి ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. 

‘‘ఐఏఎస్ కోసం సిద్ధం కావాలనుకుంటున్నారా, మీ బాధ్యత మేం తీసుకుంటాం. ‘సంభవం’ ప్రారంభం గురించి ప్రకటిస్తున్నందుకు థ్రిల్లింగ్‌గా ఉంది’’ అని సోనూసూద్ ట్వీట్ చేశారు. దానిలో భాగంగా సివిల్ సర్వీసెస్‌కు సిద్ధం అవుతోన్న విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే దరఖాస్తుల సమర్పణకు జూన్ 30 చివరి తేదీ అని తెలుస్తోంది. వెబ్‌సైట్ వివరాలను ఆ ట్వీట్‌లో పొందుపరిచారు. సోనూసూద్ ఫౌండేషన్ ద్వారా ఆయన తన సేవా కార్యక్రమాలను విస్తరిస్తున్నారు. 

గతేడాది లాక్‌డౌన్ కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజల కోసం ఈ రియల్‌ హీరో సొంతంగా రవాణా సదుపాయాలు కల్పించారు. అప్పటి నుంచి మొదలైన ఆయన ప్రయాణం కరోనా రెండో దశలోనూ కొనసాగుతోంది. కరోనా బారిన పడినవారికి వైద్యం అందించడం, అత్యవసరంగా ఆక్సిజన్ అందుబాటులో ఉంచి ఆదుకోవడం.. వంటి కార్యక్రమాలతో ప్రజల మదిలో సూపర్‌ హీరోగా స్థానం సంపాదించారు.

WEBSITE

REGISTER HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags