Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: పాలిసెట్ తో ఆర్జీయూకేటీ ప్రవేశాలు - సెట్ దరఖాస్తు గడువు పొడిగింపు - ఏపీ విద్యార్థులు పోటీ పడవచ్చు

 

TS: పాలిసెట్ తో ఆర్జీయూకేటీ ప్రవేశాలు - సెట్ దరఖాస్తు గడువు పొడిగింపు - ఏపీ విద్యార్థులు పోటీ పడవచ్చు

బాసరలోని రాజీవ్ గాంధీ సాంకేతిక, వైజ్ఞానిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ)లో ప్రవేశాలకు ఈ ఏడాది 'పాలిసెట్ ను ప్రాథమిక అర్హత పరీక్షగా నిర్ణయించారు. వర్సిటీ ఇన్ ఛార్జి వీసీ రాహుల్ బొజ్జా ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖకు లేఖ అందజేశారు. ఈ క్రమంలో ఆర్జీయూకేటీలో ప్రవేశాలు పొందాలనుకున్న విద్యార్థులు పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష- పాలిసెట్ కు దరఖాస్తు చేసుకోవాలని సెట్ ఛైర్మన్, రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు గడువు ఈ నెల 18వ తేదీతో ముగియనుండగా దాన్ని పొడిగించినట్లు సెట్ కన్వీనర్ శ్రీనాథ్ తెలిపారు. వర్సిటీలో మొత్తం 1500 సీట్లున్నాయి.

ఏపీ విద్యార్థులు పోటీ పడవచ్చు

బాసర ఆర్జీయూకేటీలో 15 శాతం సీట్లకు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడవచ్చు. ఈక్రమంలో వారు కూడా పాలిసెట్ రాయాల్సి ఉంటుందని చెబుతున్నారు. 

REVISED NOTIFICATION

WEBSITE FOR DETAILS

WEBSITE FOR APPLY

Previous
Next Post »
0 Komentar

Google Tags