Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Aadhaar Mobile Number Update at Doorstep - Details Here

 

Aadhaar Mobile Number Update at Doorstep - Details Here

పోస్ట్‌మేన్‌ సహాయంతో ఆధార్‌ కార్డులపై మొబైల్‌ నంబర్ల అనుసంధానం వివరాలు ఇవే

పోస్ట్‌మేన్‌ సహాయంతోనూ ఇంటి వద్దే ఆధార్‌ కార్డులపై మొబైల్‌ నంబర్లను అనుసంధానం చేసుకోవచ్చు. ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌(ఐపీపీబీ) ద్వారా పోస్ట్‌మేన్‌లకు ఆధార్‌ కార్డుదారుల మొబైల్‌ నంబర్లను అప్‌డేట్‌ చేసేందుకు ప్రత్యేకంగా అనుమతి ఇచ్చారు. 650 ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌లలో 1.46 లక్షల మంది పోస్ట్‌మేన్లు, గ్రామీణ్‌ డాక్‌ సేవక్స్‌ (జీడీఎస్‌) నెట్‌వర్క్‌ ద్వారా ఈ సేవ అందుబాటులో ఉంటుంది.

పోస్ట్‌మేన్‌ సహాయంతో ఇంటివద్దనే ఎవరైనా తమ ఫోన్‌ నంబరును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవచ్చని ఐపీపీబీ తెలిపింది. బ్యాంకులు లేని ప్రాంతాల్లో ఈ సేవలు అందించాలనే తమ లక్ష్యాలను దీని ద్వారా సాకారం చేసుకోనున్నట్లు ఐపీపీబీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో జె.వెంకటరాము తెలిపారు. అయితే.. త్వరలో పిల్లల ఆధార్‌ నమోదు ప్రక్రియను దీని ద్వారా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

Previous
Next Post »
0 Komentar