Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Bajaj Auto Begins Booking for Electric Scooter Chetak in Nagpur

 

Bajaj Auto Begins Booking for Electric Scooter Chetak in Nagpur

బజాజ్‌ విద్యుత్‌ చేతక్‌ బుకింగ్‌లు ప్రారంభం

విద్యుత్‌ స్కూటర్‌ చేతక్‌ బుకింగ్‌లను ఈ నెల 16 నుంచి నాగ్‌పూర్‌లో ప్రారంభించినట్లు బజాజ్‌ ఆటో వెల్లడించింది. ఆన్‌లైన్‌లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ చేతక్‌ డాట్‌ కామ్‌పై రూ.2000 చెల్లించి వినియోగదారులు ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చని తెలిపింది.

ఇంతకు ముందు బెంగళూరు, పుణె నగరాల్లో బుకింగ్‌లను ప్రారంభించగా, పూర్తి స్పందన వచ్చిందని.. నాగ్‌పూర్‌లో ఇదే ఆశిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. నాగ్‌పూర్‌ తర్వాత మరిన్ని నగరాల్లో ముందస్తు బుకింగ్‌లు ప్రారంభిస్తామని బజాజ్‌ ఆటో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ శర్మ పేర్కొన్నారు. జులై చివరకు మొదటి చేతక్‌ షిప్‌మెంట్‌ ఉంటుందని అన్నారు.

బజాజ్‌ విద్యుత్‌ చేతక్‌ రెండు వేరియంట్లు- ప్రీమియం, అర్బేన్‌ల్లో లభించనుంది. వీటి ప్రారంభ ధర రూ.1,42,998 (ఎక్స్‌-షోరూమ్‌)గా నిర్ణయించారు.

WEBSITE

E-SHOWROOM

Previous
Next Post »
0 Komentar

Google Tags