Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ICSE, ISC Board 10th and 12th Class Results Released

 

ICSE, ISC Board 10th and 12th Class Results Released

ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల 

ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ 10, 12వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ విషయాన్ని భారత పాఠశాల విద్య ధ్రువీకరణ పరీక్షల మండలి (CISCE) వెల్లడించింది. శనివారం మధ్యాహ్నం 3గంటలకు ఫలితాలను విడుదల చేశారు  విద్యార్థులు cisce.org లేదా results.cisce.org లో తమ ఫలితాలను చూసుకోవచ్చని తెలిపింది.

ఈ ఏడాది ఐసీఎస్‌ఈ పదో తరగతిలో 99.98శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ఐఎస్‌సీ 12వ తరగతిలో 99.76శాతం నమోదైంది. 

ఫలితాలు, వారికి వచ్చిన మార్కులకు సంబంధించి విద్యార్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని వివరిస్తూ వారి పాఠశాలల్లోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అభ్యంతరాలను తెలియజేయడానికి ఆగస్టు 1 మాత్రమే గడువు ఇస్తున్నట్లు CISCE కార్యదర్శి జెర్నీ అరాథూన్‌ వెల్లడించారు. పాఠశాలలు కూడా విద్యార్థుల ఫలితాలను ఐసీఎస్‌ఈ పోర్టలోని Careers విభాగం నుంచి పొందవచ్చని పేర్కొన్నారు.

SMS ద్వారా కూడా ఫలితాలు పొందొచ్చు.. 

సీఐఎస్‌సీఈ ఫలితాలను తెలుసుకొనేందుకు ఐసీఎస్‌ఈ విద్యార్థులైతే ICSE (Unique ID) టైప్‌ చేసి 09248082883 నంబర్‌కు పంపాలి. అలాగే, ఐఎస్‌సీ 12వ తరగతి విద్యార్థులైతే ISC (unique ID) టైప్‌ చేసి పైన పేర్కొన్న నెంబర్‌కే పంపి ఫలితాలు పొందవచ్చు. 

ఇదిలాఉంటే, దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోన్న నేపథ్యంలో ఐసీఎస్‌ఈ పదో తరగతి బోర్డు పరీక్షలను రద్దుచేసిన విషయం తెలిసిందే. అయితే, విద్యార్థుల ప్రతిభ ఆధారంగా వీటిని ప్రకటించనున్నారు. నిష్పాక్షిక, పారదర్శక విధానంలో విద్యార్థుల ప్రతిభను మదింపు వేసి ఫలితాలను ప్రకటిస్తామని బోర్డు ఇదివరకే వెల్లడించింది. ఇక సీబీఎస్‌ఈ పది, 12వ తరగతి ఫలితాలు కూడా త్వరలోనే వెల్లడించేందుకు CBSE బోర్డు కసరత్తు చేస్తోంది. 

WEBSITE 1

WEBSITE 2

Previous
Next Post »
0 Komentar

Google Tags