Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

LIC HFL slashes home loan rates to all-time low of 6.66%

 

LIC HFL slashes home loan rates to all-time low of 6.66%

గృహ రుణాలపై వడ్డీరేట్లను తగ్గించిన ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌

గృహ రుణాలపై వడ్డీరేట్లను ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తగ్గించింది. 6.66 శాతం వడ్డీకే ₹50 లక్షల వరకూ రుణాలను అందిస్తామని ప్రకటించింది. కొత్తగా రుణాలు తీసుకునే వ్యక్తులకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. శాలరీ అందుకునే వ్యక్తులు ఆగస్టు 31 వరకు ఈ సదుపాయం పొందొచ్చని తెలిపింది. అయితే, రుణ గ్రహీతల సిబిల్‌ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. 

కొవిడ్‌ మహమ్మారి వేళ సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే వారికి కోసం తక్కువ వడ్డీరేటుకే రుణాలు అందిస్తున్నట్లు ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో వై విశ్వనాథ్‌ గౌడ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఇంత తక్కువ వడ్డీరేటుకు రుణాలు అందించడం ఇదే ప్రథమని పేర్కొన్నారు. తమ కార్యాలయాన్ని సందర్శించకుండానే Homy యాప్‌ ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తు స్థితిని కూడా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.

WEBSITE

DOWNLOAD APP

Previous
Next Post »
0 Komentar