Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు – సమాధానాలు (10-08-2021)

 

ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు – సమాధానాలు (10-08-2021)

1. ప్రశ్న:

ఒక టీచర్ ఫిబ్రవరి 29న జాబ్ లో చేరాడు. అతనికి వార్షిక ఇంక్రిమెంట్ ఏ నెలలో ఇవ్వాలి?

జవాబు:

ఆర్.సి.2071 తేదీ:21.7.2010 ప్రకారం లీపు సంవత్సరం ఫిబ్రవరి 29న విధుల్లో చేరిన ఉపాధ్యాయుల వార్షిక ఇంక్రిమెంట్ ఫిబ్రవరి నెల లోనే ఇవ్వాలి.

------------------------------------------------------

2. ప్రశ్న:

బిడ్డ పుట్టి వెంటనే మరణించిన, వారికి మెటర్నిటీ లీవు కి అర్హత ఉందా?

జవాబు:

Lds.1941 తేదీ:11.6.90 ప్రకారం మరణించిన బిడ్డను ప్రసవించినా, ప్రసూతి సెలవు వాడుకోవచ్చు.

------------------------------------------------------

3. ప్రశ్న:

వేసవి సెలవుల్లో పని చేస్తే ELs ఎలా జమచేస్తారు?

జవాబు:

వేసవి సెలవులు 15 రోజులు కన్నా తక్కువగా వాడుకుంటే, మొత్తం వేసవి సెలవులు వాడుకోలేదన్నట్లుగా భావించి 24 ELs ఇస్తారు.

-----------------------------------------------------

4. ప్రశ్న:

సంపాధిత సెలవును అర్ధ జీతపు సెలవు, వేసవి సెలవులతో కలిపి ఒకేసారి ఎన్ని రోజులు వాడుకోవచ్చు?

జవాబు:

ఒకేసారి 180 రోజులకి మించి వాడుకోకూడదు.

----------------------------------------------------

5. ప్రశ్న:

ఒక ఉద్యోగి సస్పెన్షన్ లో ఉన్నప్పుడు ఉద్యోగం నుంచి విరమించుకోవచ్చా?

జవాబు:

విరమించుకోవటానికి అతనికి అనుమతి ఇవ్వరు.

Previous
Next Post »
0 Komentar