Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Ola Electric Scooter to launch on August 15, says CEO Bhavish Aggarwal

 

Ola Electric Scooter to launch on August 15, says CEO Bhavish Aggarwal

ఓలా స్కూటర్‌ విడుదల తేదీని ప్రకటించిన సీఈఓ భవీష్!

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ విడుదల తేదీని సంస్థ సీఈఓ భవీష్‌ అగర్వాల్‌ మంగళవారం ప్రకటించారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న స్కూటర్‌ విడుదల కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ట్విటర్‌లో వెల్లడించారు. స్కూటర్‌ ఫీచర్లు, బుక్‌ చేసుకున్న వారికి ఎప్పటి నుంచి అందుబాటులోకి రానున్నాయి.. వంటి వివరాలు ఆరోజే ప్రకటిస్తామన్నారు. 

జులై 15న ఓలా స్కూటర్‌ బుకింగ్‌లు ప్రారంభమైన విషయం తెలిసిందే. రూ.499లతో బుక్‌ చేసుకునే అవకాశం కల్పించారు. తొలి 24 గంటల్లోనే లక్షకు పైగా బుకింగ్‌లు అందాయి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భారత్‌లో తయారు చేస్తున్న ఈ స్కూటర్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వేగం, ఛార్జింగ్‌, బూట్‌ స్పేస్ విషయంలో ఈ విభాగంలో ఇదే అత్యుత్తమైనదిగా నిలిచే అవకాశం ఉందని సమాచారం. మొత్తం 10 రంగుల్లో ఇది అందుబాటులో ఉండనుంది. ఆ రంగులను ఇటీవలే కంపెనీ బహిర్గతం చేసింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags