Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Tokyo Olympics 2020: Bajrang Punia Wins Bronze Medal

 

Tokyo Olympics 2020: Bajrang Punia Wins Bronze Medal

టోక్యో ఒలింపిక్స్ 2020: కుస్తీపోటీల్లో కాంస్యం గెలిచిన బజరంగ్‌

భారత రెజ్లర్‌ బజరంగ్‌ పునియా అద్భుతం చేశాడు. పురుషుల 65 కిలోల కుస్తీపోటీల్లో కాంస్య పతకం సాధించాడు. ప్లేఆఫ్‌ పోటీల్లో  కజక్‌స్థాన్‌కు చెందిన దౌలత్‌ నియజ్‌బెకోవ్‌ను 8-0తో చిత్తు చేశాడు. 

ఈ పోరులో బజరంగ్‌ పూర్తిగా ఆధిపత్యం చలాయించాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఒకవైపు రక్షణాత్మకంగా ఆడుతూనే మరోవైపు దూకుడు ప్రదర్శించాడు. ప్రత్యర్థికి తన కాళ్లు అందకుండా జాగ్రత్తపడ్డాడు. మొదటి పీరియడ్‌లో బజరంగ్‌కు 1, 1 చొప్పున రెండు పాయింట్లు వచ్చాయి. 

ఇక రెండో పీరియడ్‌లో బజరంగ్‌ దుమ్మురేపాడు. ప్రత్యర్థి కాళ్లను పట్టుకొని రింగు బయటకు నెట్టేశాడు. వరుసగా 2, 2, 2 పాయింట్లు సాధించి తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లాడు. దౌలత్‌ అతడిని పిన్‌డౌన్‌ చేసేందుకు ప్రయత్నించినా బజరంగ్‌ గట్టిగా ప్రతిఘటించాడు. 8-0 తేడాతో విజయం అందుకున్నాడు. 

నిజానికి బజరంగ్‌ స్వర్ణ పతకం సాధిస్తాడని అంతా అనుకున్నారు. ఎందుకంటే ఈ విభాగంలో అతడు ప్రపంచ నంబర్‌ వన్‌. అయితే సెమీస్‌లో అతడి డిఫెన్స్‌ బాగా లేదు. ఇదే అదనుగా ప్రత్యర్థి అతడి కాళ్లను ఒడిసిపట్టి ఓడించాడు.

Previous
Next Post »
0 Komentar

Google Tags