Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

New PF Rules from Today 01-09-2021

 

New PF Rules from Today 01-09-2021

నేటి నుండి మార‌బోతున్న `పీఎఫ్‌` నియ‌మాలు ఇవే

కంపెనీల‌లో, సంస్థ‌ల్లో ప‌నిచేసే వారికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) గురించి తెలిసిన విష‌య‌మే. దీనికి ఎంప్లాయ్ కంట్రీబ్యూష‌న్‌ (వాటా)యే కాకుండా య‌జ‌మానిది అంతే మొత్తంలో కంట్రీబ్యూష‌న్ ఉండ‌టం దీనిలో ముఖ్య‌మైన‌ది. అంతేకాకుండా ఏ ఇత‌ర పొదుపు సంస్థ‌ల క‌న్నా కూడా ఇందులోనే ఎక్కువగా 8.5% వ‌డ్డీ రేటు  ఉండ‌టం ఉద్యోగుల‌కు లాభ‌క‌ర‌మైంది. 

నేటి (సెప్టెంబ‌ర్ 1) నుండి ఈపీఎఫ్ రూల్స్ మార‌బోతున్నాయి. ఈపీఎఫ్ ఖాతాలు గ‌ల‌వారు త‌మ ఈపీఎఫ్  ఖాతాను ఆధార్‌తో లింక్ చేయ‌బ‌డ‌ని ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలో కంపెనీ (య‌జ‌మాని) వాటా నిలిపివేయ‌బ‌డుతుంది. ఈపీఎఫ్ఓ కొన్ని నెల‌ల క్రితం ఆధార్ కార్డును పీఎఫ్ ఖాతాతో లింక్ చేయ‌బ‌డంపై ఉత్త‌ర్వును జారీ చేసింది. 2021 సెప్టెంబ‌ర్ 1 నుంచి ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్‌) రూల్ మార‌బోతుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్ (ఈపీఎఫ్ఓ) ప్ర‌కారం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్‌) ఖాతాదారులు త‌మ ఆధార్ నెంబ‌ర్‌ను పీఎఫ్ ఖాతాకు ఈ ఆగ‌స్టు 31వ తేదిలోపు లింక్ చేయ‌డం త‌ప్ప‌నిస‌రి.

WEBSITE

ఈపీఎఫ్ ఖాతాకు వారి ఆధార్‌తో లింక్ చేయ‌బ‌డ‌ని ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలో య‌జ‌మాని వాటా (కంట్రీబ్యూష‌న్‌) నిలిపివేయ‌బ‌డుతుంది. యూఏఎన్ ఆధార్ ధృవీక‌రించ‌బ‌డ‌క‌పోతే దాని ఎల‌క్ట్రానిక్ చ‌లాన్ క‌మ్ రిట‌ర్న్ (ఈసీఆర్‌) నింప‌బ‌డదు. దీని అర్ధం, ఉద్యోగులు వారి స్వంత పీఎఫ్ ఖాతాను చూడ‌గ‌లిగిన‌ప్ప‌టికీ, వారు కంపెనీ య‌జ‌మాని వాటాను పొంద‌లేరు. ప్రావిడెంట్ ఫండ్ రెగ్యులేట‌ర్ కూడా అన్ని ఈపీఎఫ్ ఖాతాదారుల యూనివ‌ర్స‌న‌ల్ అకౌంట్ నంబ‌ర్ (యూఏఎన్‌) ఆధార్ ధృవీక‌రించ‌బ‌డాల‌ని య‌జ‌మానుల‌ను ఆదేశించింది. ఇంత‌కు ముందు ఈపీఎఫ్ - ఆధార్ లింక్ కోసం 30 మే 2021 వ‌ర‌కు గ‌డువు ఉంది. కానీ త‌ర్వాత, ఈపీఎప్ఓ - ఆధార్ లింక్ చివ‌రి తేదీని 2021 ఆగ‌స్టు 31 వ‌ర‌కు పొడిగించింది. 

ఈపీఎఫ్‌లో ఉద్యోగికి కోవిడ్ - 19 అడ్వాన్స్ తీసుకోవ‌డం, పీఎఫ్ బీమా, ఇత‌ర పొదుపు ప‌థ‌కాల క‌న్నా అధిక వ‌డ్డీ రేటు పొంద‌డం వంటి అనేక ప్ర‌యోజ‌నాలు, ఉప‌యోగాలున్నాయి.

 

ఈపీఎఫ్ - ఆధార్ లింక్ ఆన్‌లైన్ ఎలా చేయాలి:

పీఎఫ్ స‌భ్యుల పోర్ట‌ల్‌లో మీ ఈపీఎఫ్ ఖాతాకు లాగిన్ అవ్వండి.

మీ `యూఏఎన్‌` ఆధార్లో న‌మోదు చేసుకున్న మోబైల్ నంబ‌ర్‌ను న‌మోదు చేయండి.

`జ‌న‌రేట్ ఓటీపీ` ఎంపిక‌పై క్లిక్ చేయండి.

ఓటిపీని పూర్తిచేసి జెండ‌ర్ (లింగాన్ని) ఎంచుకోండి.

ఆధార్ నంబ‌ర్ ఎంట‌ర్ చేసి `ఆధార్ వెరిఫికేష‌న్‌`ను ఎంచుకోండి.

మొబైల్, ఈ-మెయిల్ ఆధారిత ధృవీక‌ర‌ణ ఎంపిక‌ను ఎంచుకోండి.

మీ మొబైల్ నంబ‌ర్‌కు మ‌రో `ఓటీపీ` వ‌స్తుంది.

2`ఓటీపీ`ని న‌మోదు చేయండి.

మీ ఈపీఎఫ్‌, యూఏఎన్ ఆధార్ సీడింగ్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయండి.

Previous
Next Post »
0 Komentar