Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Stryder Cycles Launches Two New E-Bikes

 

Stryder Cycles Launches Two New E-Bikes

స్ట్రైడర్‌ సైకిల్స్‌ నుంచి 2 ఇ-బైకులు - ఒకసారి ఛార్జింగ్‌తో 60 కి.మీ 

టాటా ఇంటర్నేషనల్‌ అనుబంధ సంస్థ స్ట్రైడర్‌ సైకిల్స్‌ అర్బన్‌ కమ్యూటర్‌ విభాగంలో రెండు కొత్త ఇ-బైకులను విపణిలోకి విడుదల చేసింది. వోల్టాక్‌ 1.7, కాంటినో ఈటీబీ-100 మోడళ్లకు ప్రారంభధరగా రూ.29,995ను నిర్ణయించింది. ఒక్కసారి ఛార్జింగ్‌తో 60 కి.మీ ప్రయాణించొచ్చని తెలిపింది.

ఏఆర్‌ఏఐ నిబంధనలకు లోబడిన తేలికపాటి బైకు కాంటినో ఈటీబీ-100లో ఏడు స్పీడ్‌లు, 3 రైడ్‌ మోడ్‌లు (ఎలక్ట్రిక్‌, హైబ్రిడ్‌, పెడల్‌), డ్యూయల్‌ డిస్క్‌ బ్రేక్‌లు, కీ లాక్డ్‌ బ్యాటరీ, ఫ్రంట్‌ ఎల్‌ఈడీ దీపాలు వంటి స్మార్ట్‌ భద్రత ఫీచర్లు ఉన్నాయి. స్ట్రైడర్‌ వోల్టాక్‌ 1.7లో 48వీ/260 డబ్ల్యూ మోటార్‌, మూడు గంటల్లో ఛార్జింగ్‌ అయ్యే 48వీ లిథియం అయాన్‌ బ్యాటరీ వంటి ఫీచర్లు ఇచ్చారు.

STRYDER BIKES WEBSITE

CONTINO BIKES WEBSITE

Previous
Next Post »
0 Komentar