Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Telugu Wikipedia Ranks Third in all Wikipedia

 

Telugu Wikipedia Ranks Third in all Wikipedia

వికీపీడియాల్లో ‘తెలుగు’కు మూడో స్థానం - తెలుగు వికీపీడియాకు అరుదైన ఘనత

వికీపీడియా వ్యాసాలలో అవసరమైన చిత్రాలు ఉపయోగించేందుకు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పోటీల్లో తెలుగు వికీపీడియా సత్తా చాటింది. ప్రపంచంలోని మిగిలిన భాషల్లో ఉన్న వికీపీడియాలతో పోటీపడి మూడో స్థానం దక్కించుంది. ఈ పోటీలలో వీవో భాష వికీపీడియా మొదటి స్థానం దక్కించుకోగా.. ఆంగ్ల మాధ్యమం రెండోస్థానంలో నిలిచింది. 

వికీపీడియాలోని వ్యాసాలకు చిత్రాలు ఉంచేందుకు ఏటా జులై, ఆగస్టు నెలల్లో నిర్వాహకులు ‘వికీపీడియా పేజెస్‌ వాంటింగ్‌ ఫొటోస్‌’ పేరిట పోటీ నిర్వహిస్తారు. రెండు నెలలపాటు తెలుగు రచయితలు దాదాపు 22,700 గ్రామాలకు సంబంధించిన వ్యాసాలకు మ్యాపులను అప్‌లోడ్‌ చేయగలిగారు. దీనివల్ల తెలుగు వికీపీడియాలో 28,605 వ్యాసాలకు ఫొటోలు, మ్యాపులు అందుబాటులోకి వచ్చినట్లు అయ్యింది. తద్వారా అత్యధిక ఫొటోలు అప్‌లోడ్‌ చేయడంలో తెలుగు మాధ్యమం మూడోస్థానం దక్కించుకుంది.

ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో ఏపీ, తెలంగాణలోని 30వేల గ్రామాలకు సంబంధించి వ్యాసాలు ఉండగా, ఆయా ప్రాంతాల విద్య, వైద్య, రవాణా, దర్శనీయ ప్రదేశాలు తదితర సమాచారం అందుబాటులో ఉంది. తాజాగా చాలావరకు వ్యాసాలకు గ్రామాల మ్యాపులు తోడయ్యాయి. కొత్తగా వికీపీడియాలో చేరిన ఔత్సాహిక రచయితలు te.wikipedia.org వెబ్‌సైట్‌లోకి వెళ్లి వర్గం: ఆంధ్రప్రదేశ్‌ గ్రామాలు, వర్గం:తెలంగాణ గ్రామాలు అని వెతికి ఆయా ప్రాంతాల సమాచారం చూసే వీలుంది. తమ గ్రామానికి చెందిన ఫొటోలను వ్యాసాల్లో చేర్చేందుకు అవకాశం ఉందని తెలుగు వికీపీడియా రచయిత ప్రణయ్‌రాజ్‌ వివరించారు. 

స్వాతంత్య్రంపై ఏడాదిలోగా 3వేల వ్యాసాలు 

ప్రస్తుతం దేశంలో 75వ స్వాతంత్య్ర ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా తెలుగు రచయితలు స్వాతంత్య్ర పోరాటం, 75ఏళ్ల ప్రస్థానంపై ఏడాదిలోగా 3వేల వ్యాసాలు రాయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.

TELUGU WIKIPEDIA PAGE

Previous
Next Post »
0 Komentar

Google Tags