Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TSBIE: ఇంటర్ ఫస్టియర్‌ పరీక్షలలో 70 శాతం సిలబస్ - నమూనా ప్రశ్నా పత్రాలు, పరీక్షల మెటీరియల్‌ వివరాలు ఇవే

 

TSBIE: ఇంటర్ ఫస్టియర్‌ పరీక్షలలో 70 శాతం సిలబస్ - నమూనా ప్రశ్నా పత్రాలు, పరీక్షల మెటీరియల్‌ వివరాలు ఇవే  

ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణపై తెలంగాణ ఇంటర్‌ బోర్డు కీలక ప్రకటన చేసింది. 70 శాతం సిలబస్‌ నుంచే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ తెలిపారు.

ప్రశ్నల్లో మరిన్ని ఛాయిస్‌లు పెంచామన్నారు. నమూనా ప్రశ్నా పత్రాలు, పరీక్షల మెటీరియల్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు జలీల్‌ తెలిపారు. ప్రస్తుతం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఈనెల 25 నుంచి మొదటి సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి.

రెండో సంవత్సరంలో కాలేజీ మారిన విద్యార్థులు... మొదటి సంవత్సరం ఫీజు చెల్లించిన కాలేజీ జోన్ పరిధిలోనే పరీక్ష రాయాలని జలీల్‌ తెలిపారు. విద్యార్థుల కెరీర్, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే పరీక్షలు నిర్వహిస్తున్నామని జలీల్ తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, భయం లేకుండా పరీక్షలు ఎదుర్కోవాలన్నారు.


SYLLABUS (70%)

MODEL QUESTION PAPERS

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags