Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Hero Lectro Launches e-Cycles; F2i, F3i Electric Mountain Bicycles with Bluetooth Connectivity – Details Here

 

Hero Lectro Launches e-Cycles; F2i, F3i Electric Mountain Bicycles with Bluetooth Connectivity – Details Here

హీరో కొత్త విద్యుత్‌ సైకిళ్లు - బ్లూటూత్ కనెక్టివిటీతో F2i, F3i ఎలక్ట్రిక్ మౌంటైన్ సైకిళ్లు – వివరాలు ఇవే

హీరో సైకిల్స్‌ విద్యుత్‌ బ్రాండ్‌ హీరో లెక్ట్రో రెండు కొత్త ఉత్పత్తులు- ఎఫ్‌2, ఎఫ్‌3ఐలను విపణిలోకి విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా రూ.39,999, రూ.40,999. హీరో లెక్ట్రో సొంత ఆర్‌ఖీడీ కేంద్రంలో వీటిని అభివృద్ధి చేశారు. కొత్త సైకిళ్లను ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 35 కి.మీ వరకు ప్రయాణం చేయొచ్చు. 7-స్పీడ్‌ గేర్స్‌, 100ఎంఎం సస్పెన్షన్‌, డ్యూయల్‌ డిస్క్‌ బ్రేక్‌లు, బ్లూటూత్‌ అనుసంధానత వంటి ఫీచర్లు వీటిలో ఉన్నాయి.

సాహసం, వినోదం, ఫిట్‌నెస్‌ కోరుకునే యువత కోసం కొత్త ఇ-సైకిళ్లు తీసుకొచ్చినట్లు హీరో లెక్ట్రో సీఈఓ ఆదిత్య ముంజాల్‌ పేర్కొన్నారు. ఎఫ్‌2, ఎఫ్‌3ఐల్లో నాలుగు మోడ్‌లు-పెడెలెక్‌, థ్రోటిల్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌, మాన్యువల్‌లున్నాయి. హీరో లెక్ట్రో విక్రయశాలలు, ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లపై ఇవి లభిస్తాయి.

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags