Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

India's Harnaaz Sandhu Brings Home Miss Universe Crown After 21 Years

 

India's Harnaaz Sandhu Brings Home Miss Universe Crown After 21 Years

21 ఏళ్ల తర్వాత మిస్‌ యూనివర్స్‌గా భారత యువతి హర్నాజ్‌ సంధు

మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని భారత యువతి హర్నాజ్‌ సంధు కైవసం చేసుకున్నారు. ఇజ్రాయెల్‌ వేదికగా జరిగిన మిస్‌ యూనివర్స్‌-2021 పోటీల్లో హర్నాజ్‌ విజేతగా నిలిచారు. 21 ఏళ్ల తర్వాత భారత్‌కు విశ్వసుందరి కిరీటం దక్కడంతో ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌కు ఇది మూడో మిస్ యూనివర్స్‌ కిరీటం. 1994లో మొదటిసారి సుస్మితా సేన్‌ ఈ కిరీటాన్ని  దక్కించుకోగా.. 2000లో లారాదత్తా..  మళ్లీ ఇప్పుడు హర్నాజ్‌ విశ్వ వేదికపై విజేతగా నిలిచారు.

నటిగానూ..

హిందీ, పంజాబీ, ఇంగ్లిష్‌ భాషలను అనర్గళంగా మాట్లాడగలిగిన హర్నాజ్‌ ఒకపక్క మోడలింగ్‌ చేస్తూనే సినిమాల్లో నటించే అవకాశాలను పొందింది. ‘బాయి జీ కుట్టాంగే, యారా దియా పూబరన్‌’ అనే పంజాబీ సినిమాలలో నటించింది, ఇవి వచ్చే ఏడాది విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హార్నాజ్‌కు ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. 

అందుకే పర్యావరణాన్ని కాపాడండి అని గొంతెత్తి చెబుతోంది. ఇప్పటిదాకా పాల్గొన్న అందాల పోటీల్లో పర్యావరణంపై అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబుతూ న్యాయ నిర్ణేతల మనసులు గెలుచుకుంది. ‘ఇండియాకు మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని తీసుకొచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాను’ అని చెప్పడమే కాక.. ఆ మాటలను నిజం చేసి చూపింది హర్నాజ్. సోషల్‌మీడియాలోనూ ఆమెకు ఎక్కువమంది ఫాలోవర్స్‌ ఉన్నారు.

WEBSITE

YOUTUBE CHANNEL

Previous
Next Post »
0 Komentar

Google Tags