Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Jio Launches Happy New Year Plan 2022 – Details Here

 

Jio Launches Happy New Year Plan 2022 – Details Here

జియో నూతన సంవత్సరపు ఆఫర్‌.. ఆ ప్లాన్‌పై అదనపు వ్యాలిడిటీ – వివరాలు ఇవే

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రిలయన్స్‌ జియో తమ యూజర్లకు కొత్త ఆఫర్‌ ప్రకటించింది. రూ.2,545 ప్రీపెయిడ్‌ ప్లాన్‌పై 29 రోజుల అదనపు వ్యాలిడిటీ అందిస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 336 రోజులే కాగా.. ఆఫర్‌ కింద 365 రోజుల వ్యాలిడిటీ అందిస్తున్నట్లు జియో ప్రకటించింది. జనవరి 2 వరకు మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది. 



ఈ ప్లాన్‌తో రీఛార్జి చేసుకున్న వారికి రోజుకు 1.5 జీబీ చొప్పున డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లతో పాటు అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ చేసుకునే సదుపాయం జియో కల్పిస్తోంది. దీంతో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా లభిస్తుంది. దీర్ఘకాలం ప్లాన్‌ తీసుకోవాలనుకునే వారికి ఈ రీఛార్జి ప్లాన్‌ ఉపకరిస్తుంది. ప్రస్తుత యూజర్లతో పాటు, కొత్తగా జియో సిమ్‌ తీసుకున్న వారికి సైతం ఈ ప్లాన్‌ వర్తిస్తుంది.

DOWNLOAD MY JIO APP

JIO WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags