Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Income Tax Return (ITR) Filing Deadline Extended – Details Here

 

Income Tax Return (ITR) Filing Deadline Extended – Details Here

ఐటీ రిటర్నుల దాఖలుకు గడువు మరోసారి పొడిగింపు – వివరాలు ఇవే

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు గడువును ఆడిట్‌ వర్తించే సంస్థలకు మళ్లీ పొడిగించింది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పన్ను చెల్లింపుదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని 2021-22 మదింపు సంవత్సరానికి ఐటీఆర్‌ దాఖలు చేయడానికి  మార్చి 15 వరకు అవకాశం కల్పిస్తున్నట్టు సీబీడీటీ మంగళవారం సాయంత్రం ప్రకటించింది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని నిబంధనల ప్రకారం వివిధ ఆడిట్ రిపోర్టుల ఈ-ఫైలింగ్ చేసేటప్పుడు ఎదురవుతున్న ఇబ్బందుల కారణంగా కూడా ఈ గడువును పొడిగిస్తున్నట్టు తెలిపింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఐటీ శాఖ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. 

ఐటీ రిటర్నుల దాఖలు కోసం ఇన్ఫోసిస్‌ సంస్థ రూపొందించిన కొత్త వెబ్‌సైట్‌లో సాంకేతికత సమస్యల పరిష్కారం కొలిక్కిరాని నేపథ్యంలో సెప్టెంబరు 30 వరకు ఉన్న ఈ గడువును డిసెంబర్‌ 31 వరకు పెంచుతూ గతంలో కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, ఐటీఆర్‌ గడువును పెంచే యోచనలేదని గతేడాది డిసెంబర్‌లో స్పష్టం చేసిన  కేంద్ర ప్రభుత్వం.. తాజాగా దేశంలో నెలకొన్న కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Previous
Next Post »
0 Komentar

Google Tags