Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS Intermediate 2022-23 Academic Year Schedule Details Here

 

TS Intermediate 2022-23 Academic Year Schedule Details Here

టి‌ఎస్: ఇంటర్మీడియట్ 2022-23 విద్యా సంవత్సరం షెడ్యూల్ వివరాలు ఇవే

ఇంటర్‌ రెండో సంవత్సరం తరగతులు జూన్ 15వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటించింది. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ తరగతులు, సెలవులు, పరీక్షల షెడ్యూల్‌ను సోమవారం ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం 221 పని రోజులతో ఇంటర్ విద్యా సంవత్సరం ఉంటుందని తెలిపింది. అలాగే మొదటి సంవత్సరం తరగతులను జులై 1 నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.

‘‘ఈ ఏడాది మొత్తం 221 పని దినాలు ఉంటాయి. జూన్‌ 15 నుంచి సెకండ్‌ ఇయర్‌, జులై 1 నుంచి ఫస్ట్‌ ఇంటర్‌ తరగతులు మొదలవుతాయి. అక్టోబరు 2 నుంచి 9 వరకు దసరా సెలవులు, జనవరి 13 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నాం. ఫిబ్రవరి 6 నుంచి 13 వరకు ప్రీఫైనల్ పరీక్షలు, ఫిబ్రవరి 20 నుంచి మార్చి 6 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తాం. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు జరుగుతాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు అమలు అవుతాయి. 2023 మే చివరి వారంలో ఇంటర్ అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తాం. వచ్చే ఏడాది జూన్ 1న కాలేజీలు పునః ప్రారంభమవుతాయి’’ అని ఇంటర్ బోర్డు ప్రకటించింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags