Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Bill Gates Shares His 48-Year-Old Resume, A Message for Jobseekers through LinkedIn

 

Bill Gates Shares His 48-Year-Old Resume, A Message for Jobseekers through LinkedIn

బిల్ గేట్స్ 48 ఏళ్ల క్రితం తాను తయారు చేసుకున్న రెజ్యూమ్ ఇదే

====================

కుబేరుడు, బిజినెస్ మ్యాన్ బిల్ గేట్స్ (Bill Gates) ఓ అరుదైన విషయాన్ని లింక్ డ్  ఇన్ (LinkedIn) వేదికగా పంచుకున్నారు. 48 ఏళ్ల క్రితం తాను తయారు చేసుకున్న రెజ్యూమ్ ను షేర్ చేశారు. రెజ్యూమ్ ను లింక్ లో పోస్టు చేస్తూ సరదా వ్యాఖ్యలు చేశారు. 'మీరు ఈ మధ్యే డిగ్రీ పూర్తి చేసుకున్న అభ్యర్థులైనా, లేదా కాలేజీ చదువుల్ని మధ్యలోనే మానేసినవారైనా కానీ మీ రెజ్యూమ్ 48 ఏళ్ల క్రితం నాటి నా రెజ్యూమ్ కంటే కచ్చితంగా బెటర్ గా ఉంటుందని భావిస్తున్నా 'నంటూ పోస్టు చేశారు. కాగా ప్రస్తుతం ఆయన పోస్టు వైరల్ గా మారింది.

బిల్ గేట్స్ హార్వర్డ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో ఈ రెజ్యూమ్ ను తయారు చేసుకున్నారు. ఇందులో తన పని అనుభవం సహా.. షాడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ స్ట్రక్చర్, డేటాబేస్ మేనేజ్ మెంట్, కంపైలర్ నిర్మాణం, కంప్యూటర్ గ్రాఫిక్స్ లాంటి నైపుణ్యాలను రాసుకొచ్చారు. వీటితోపాటు ప్రోగ్రామింగ్ భాషల్లో తన ప్రావీణ్యాలను వెల్లడించారు. 1973లో సిస్టమ్స్ గ్రూప్, 1972లో సీటెల్ లోని లకా సైడ్ స్కూల్లో కాంట్రాక్ట్ పై సహ నాయకుడిగా, సహ భాగస్వామిగా పనిచేసినట్లు రాసుకొచ్చారు.

బిల్ గేట్స్ ఈ రెజ్యూమ్ ను పంచుకుంటూ దీనికి మరిన్ని మెరుగులు దిద్దితే బాగుండేదని కూడా అభిప్రాయపడ్డారు. అయితే నెటిజన్లు మాత్రం గేట్స్ రెజ్యూమ్ పర్ ఫెక్ట్ ఉందని పేర్కొంటున్నారు. నేటి యువతలో స్ఫూర్తి నింపేందుకు నాటి అంశాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

====================

CLICK FOR BILL GATES CV IN 1978

CLICK FOR OFFICIAL POST FROM BILL GATES

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags