Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

PM YASASVI Entrance Test 2022: Young Achievers Scholarship Entrance Test – All the Details Here

 

PM YASASVI Entrance Test 2022: Young Achievers Scholarship Entrance Test – All the Details Here

యశస్వి-2022: పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రంట్ ఇండియా – పూర్తి వివరాలు ఇవే

కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పాఠశాల విద్యార్థుల చదువుల కోసం ఆర్థికంగా ఆసరా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రంట్ ఇండియా (యశస్వి) ప్రవేశ పరీక్ష-2022 నిర్వహణకు గాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎటీఏ) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న పాఠశాల విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

యశస్వి అనేది ఇతర వెనుకబడిన తరగతి (ఓబీసీ), ఆర్థికంగా వెనుకబడిన తరగతి (ఈబీసీ), డీ-నోటిఫైడ్, నోమాడిక్ & సెమీ నోమాడిక్ ట్రైబ్స్ వర్గాలకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన స్కాలర్ షిప్ పథకం.

అర్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రస్తుత విద్యాసంవత్సరంలో 9వ తరగతి లేదా 11వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. వార్షిక ఆదాయం 2.5 లక్షలకు మించని తల్లిదండ్రుల విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం: దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష- యశస్వి ప్రవేశ పరీక్ష-2022 ఆధారంగా ఎంపిక చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాలు: అమరావతి, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, సికింద్రాబాద్, ఖమ్మం , కరీంనగర్.

పరీక్ష విధానం: ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్ భాషల్లో బహుళైచ్ఛిక ప్రశ్నలుంటాయి. వ్యవధి 3 గంటలు. గణితం, సైన్స్, సోషల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్/ నాలెడ్జ్ సబ్జెక్ట్ లో ప్రశ్నలుంటాయి. ప్రశ్నల సంఖ్య 100, ప్రశ్నకు 4 మార్కుల చొప్పున మొత్తం 400 మార్కులకు ప్రశ్న పత్రం ఉంటుంది

ఆన్ లైన్ దరఖాస్తుల ప్రారంభ తేది: 27-07-2022.

ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేది: 26-08-2022.

దరఖాస్తు సవరణలకు అవకాశం: 27.08.2022 నుంచి 31.08.2022 వరకు.

హాల్ టికెట్ డౌన్లోడ్ తేది: 05.09.2022 నుంచి

పరీక్ష తేది: 11.09.2022.

INFORMATION BULLETIN

REGISTER

LOGIN

PUBLIC NOTICE

LIST OF SCHOOLS

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags