Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Jio Announces Independence Offer with 100% Value Back – Details Here

 

Jio Announces Independence Offer with 100% Value Back – Details Here

స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్ కింద 100% వాల్యూ బ్యాక్‌ - పూర్తి వివరాలు ఇవే 

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్త లాంగ్ టర్మ్ ప్లాన్‌ను ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్ కింద రూ. 2999 రీఛార్జిపై ఏడాది వ్యాలిడిటీతో రూ.3వేలు విలువైన ప్రయోజనాలను కూపన్ల రూపంలో ప్రకటించింది. ఆగస్టు 9 నుంచి ఈ ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు జియో పేర్కొంది. ఏడాది వ్యాలిడిటీ ప్లాన్ కోసం చూసేవారు దీన్ని ఎంపిక చేసుకోవచ్చు.

ప్లాన్ విషయానికొస్తే.. రూ.2999తో రీఛార్జి చేసుకునే జియో ప్రీపెయిడ్ వినియోగదారులకు 365 రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది. అన్ లిమిటెడ్ కాల్స్, 100 sms లతో పాటు రోజుకు 2.5 జీబీ డేటా చొప్పున మొత్తం 912.5 జీబీ డేటా లభిస్తుంది. ఏడాది పాటు డిస్నీ + హాట్ స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ కూడా పొందొచ్చు. వీటితో పాటు రూ. 750 చొప్పున అజియో, నెట్ మెడ్స్, ఇక్సీగో కూపన్లను అందిస్తోంది. రూ. 750 విలువైన 75జీబీ అదనపు డేటాను సైతం జియో తన యూజర్లకు ఇస్తోంది. ఆన్లైన్ లేదా ఆన్లైన్ ద్వారా రీఛార్జిపై ఈ ప్రయోజనాలను పొందొచ్చు. రీఛార్జి చేసిన 72 గంటల్లో మైజియో యాప్ లో ఈ కూపన్లు కనిపిస్తాయి.

75జీబీ అదనపు డేటాను వినియోగదారుడు తనకు అవసరం అయినప్పుడు వాడుకోవచ్చు. నెట్‌మెడ్స్, అజియో, ఇక్సిగో కూపన్లను ఆయా వేదికలపై నిర్దేశిత మొత్తంలో కొనుగోళ్లపై రిడీమ్ చేసుకోవచ్చు. ఇప్పటికే జియో రెండు లాంగ్ టర్మ్ ప్లాన్లను అందిస్తోంది. రూ. 2879, రూ. 2545 ప్లాన్లను కొంతకాలంగా కొనసాగిస్తోంది. రూ. 2879 ప్లాన్ పై 2జీబీ రోజువారీ డేటాతో పాటు జియో యాప్స్ ను ఉచితంగా అందిస్తోంది. రూ. 2545 రీఛార్జి పై 336 రోజుల వ్యాలిడిటీతో 1.5జీబీ చొప్పున డేటా అందిస్తోంది. ఈ రెండు ప్లాన్లకు డిస్నీ + హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ ఉండదు.

MY JIO APP

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags