Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SSC Recruitment 2022 – Apply for 4300 Sub-Inspector (SI) Posts

 

SSC Recruitment 2022 – Apply for 4300 Sub-Inspector (SI) Posts

దిల్లీ పోలీసు విభాగంలో 4300 ఎస్ఐ, సీఆర్‌పీఎఫ్ పోస్టులు పూర్తి వివరాలు ఇవే

దిల్లీ పోలీసు విభాగంలో 4300 సబ్ ఇన్ స్పెక్టర్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్ సీ) ఆన్ లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఇందుకు సంబంధించి సబ్ ఇన్ స్పెక్టర్ (ఎస్ఐ) ఇన్ దిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఆర్‌పీఎఫ్) ఎగ్జామినేషన్-2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

1. దిల్లీ పోలీసు విభాగంలో సబ్-ఇన్ స్పెక్టర్ (పురుషులు): 228 పోస్టులు

2. దిల్లీ పోలీసు విభాగంలో సబ్-ఇన్ స్పెక్టర్ (మహిళలు): 112 పోస్టులు

3. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సు (సీఆర్‌పీఎఫ్) లో సబ్-ఇన్ స్పెక్టర్ (జీడీ): 3960 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 4300

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమానం ఉత్తీర్ణత.

వయోపరిమితి: 01-01-2022 నాటికి 20 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (పేపర్-1, పేపర్-2), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ)/ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (పీఈటీ), మెడికల్ ఎగ్జామినేషన్ (డీఎంఈ), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు రుసుము: రూ.100 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులకు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది)

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, చీరాల, విజయనగరం, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 30.08.2022.

ఆఫ్లైన్ చలాన్ రూపొందించడానికి చివరి తేది: 30.08.2022.

ఆన్లైన్ ఫీజు చెల్లింపునకు చివరి తేది: 31.08.2022.

చలాన్ ద్వారా ఫీజు చెల్లింపునకు చివరి తేది: 31.08.2022.

దరఖాస్తులో వివరాల మార్పు, ఛార్జీల చెల్లింపు తేది: 01.09.2022.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష షెడ్యూల్: నవంబర్, 2022.

ఎలా దరఖాస్తు చేసుకోవాలో కింది నోటిఫికేషన్‌లోని Para 8 ని చూడండి.

NOTIFICATION

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags