Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Police Recruitment: All the Details for 6511 Posts (6100 Constable & 411 SI Posts)

 

AP Police Recruitment: All the Details for 6511 Posts (6100 Constable & 411 SI Posts)

ఏపీ: 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీకి పూర్తి వివరాలు ఇవే (6,100 కానిస్టేబుల్, 411 ఎస్సై పోస్టులు)

=======================

UPDATE 21-12-2023

ఏపీ: ఎస్సై రిక్రూట్మెంట్ ఎంపిక జాబితా విడుదల

ఏపీ లోని ఎస్సై (SI) ఉద్యోగాల ఎంపిక జాబితాను రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (ఏపీఎస్ఎల్పీఆర్బీ) తాజాగా విడుదల చేసింది. అలాగే కటాఫ్ మార్కుల వివరాలను విడుదల చేశారు. ఎస్సై సివిల్, రిజర్వ్ విభాగాల్లోని 411 ఖాళీల భర్తీకి ఈ ఏడాది పోలీసు శాఖ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.

ప్రాథమిక రాత పరీక్షకు 1.51 లక్షల మంది అభ్యర్థులు హాజరుకాగా.. వీరిలో 57,923 మంది అర్హత సాధించారు. వీరికి ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 35 వేల మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరికి అక్టోబర్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించి.. డిసెంబర్ 6న ఫలితాలను విడుదల చేశారు.

SELECTION LIST TO THE POST OF SCT SI (CIVIL)

SELECTION LIST TO THE POST OF SCT RSI (APSP)

CUT OFF MARKS TO THE POST OF SCT SI (CIVIL)

CUT OFF MARKS TO THE POST OF SCT RSI (APSP)

PRESS NOTE 20-12-2023

WEBSITE

=======================

UPDATE 06-12-2023

ఏపీ: ఎస్సై ఉద్యోగాల తుది రాతపరీక్షల ఫలితాలు విడుదల

CLICK FOR RESULTS

PRESS NOTE

WEBSITE

=======================

UPDATE 16-10-2023

ఏపీ: ఎస్సై ఉద్యోగాల తుది రాతపరీక్షల ప్రశ్నపత్రాలు & ప్రిలిమినరీ ‘కీ’ లు విడుదల

ఏపీ లో ఎస్సై ఉద్యోగాల తుది రాతపరీక్షల పేపర్-3, 4 పరీక్షల ప్రశ్నపత్రాలతో పాటు ప్రిలిమినరీ ‘కీ’లను ఏపీ ఎస్ఎల్పీఆర్బీ విడుదల చేసింది. సమాధానాలపై అభ్యంతరాలను అక్టోబర్ 18వ తేదీ సాయంంత్రం 5.00 గంటల్లోగా నిర్ణీత ఫార్మాట్లో మెయిల్ ద్వారా తెలియజేయాలి. అనంతరం తుది కీతో పాటు ఫలితాలు వెలువడనున్నాయి.

Paper-III Preliminary Key

Paper-III - Set-A Question Paper Booklet

Paper-III - Set-B Question Paper Booklet

Paper-III - Set-C Question Paper Booklet

Paper-III - Set-D Question Paper Booklet 

Paper-IV Preliminary Key

Paper-IV - Set-A Question Paper Booklet

Paper-IV - Set-B Question Paper Booklet

Paper-IV - Set-C Question Paper Booklet

Paper-IV - Set-D Question Paper Booklet 

PRESS NOTE

WEBSITE

=========================

UPDATE 06-10-2023

APSLPRB: ఎస్సై పోస్టులు తుది రాత పరీక్షల హాల్ టికెట్లు విడుదల

ఏపీ లో  411 ఎస్సై ఉద్యోగ నియామకాలకు సంబంధించి తుది రాత పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు వెబ్సైట్లో వివరాలు నమోదు చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ అవకాశం 12వ తేదీ వరకు ఉంటుంది. మెయిన్స్ కు  31,193 మంది అర్హత సాధించగా, వీరిలో 27,590 మంది పురుషులు, 3,603 మంది మహిళలు ఉన్నారు. పీఎంటీ/ పీఈటీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అక్టోబర్ 14, 15 తేదీల్లో తుది పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీ పోలీసు నియామక మండలి ప్రకటించిన విషయం తెలిసిందే.

అభ్యర్థులకు మొత్తం నాలుగు పేపర్ల పరీక్ష ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో, రెండు పేపర్లు డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటాయి. అక్టోబర్ 14వ తేదీ ఉదయం 10 గం. నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్-1; మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్-2 (రెండూ డిస్క్రిప్టివ్ విధానంలో జరుగుతాయి. అక్టోబర్ 15 ఉదయం 10 గం. నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్-3; మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్-4 (రెండూ ఆబ్జెక్టివ్ విధానంలో) నిర్వహిస్తారు.

విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలులో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రిలిమినరీ రాత పరీక్ష, సెప్టెంబర్లో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ) నిర్వహించారు. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సివిల్) పోస్టులకు (పురుషులు, మహిళలు), రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (పురుషులు) పోస్టులకు సంబంధించి 411 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది.

DOWNLOAD HALL TICKETS

PRESS NOTE

WEBSITE

=========================

UPDATE 14-08-2023

ఎస్సై ఉద్యోగాల ‘పీఎంటీ/ పీఈటీ’ సంబంధించిన కాల్ లెటర్లు విడుదల

ఫిజికల్ ఈవెంట్స్ జరిగే వేదికలు మరియు షెడ్యూల్ వివరాలు ఇవే

ఏపీ లో ఎస్సై ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫిజికల్ ఈవెంట్స్ షెడ్యూలు వెలువడింది. ఈ మేరకు ఏపీ పోలీసు నియామక మండలి అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఆగస్టు 25 నుంచి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ) నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

ఈ ఈవెంట్స్ ను విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, ఏలూరులో వేదికలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఆగస్టు 14 నుంచి పీఎంటీ/ పీఈటీ సంబంధించిన కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. అభ్యర్థులు తప్పనిసరిగా తమ వెంట స్టేజ్-2 అప్లికేషన్ ఫాం తెచ్చుకోవాలని బోర్డు స్పష్టం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఎస్సై ఉద్యోగాలకు ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రాతపరీక్షకు మొత్తం 1,51,288 మంది అభ్యర్థులు హాజరుకాగా.. వారిలో 57,923 మంది అభ్యర్థులు (38 శాతం) ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించారు. వీరిలో 49,386 మంది పురుషులు, 8537 మహిళలు ఉన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సివిల్) పోస్టులకు (పురుషులు, మహిళలు), రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (పురుషులు) పోస్టులకు సంబంధించి 411 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది.

DOWNLOAD CALL LETTER

PRESS NOTE

WEBSITE

=========================

UPDATE 10-03-2023

కానిస్టేబుల్ పోస్టుల పీఎంటీ / పీఈటీ పరీక్ష తేదీ అప్డేట్

ఏపీలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం మార్చి 14 నుంచి జరగాల్సిన ఫిజికల్ ఈవెంట్స్ (పీఎంటీ/పీఈటీ) వాయిదా పడ్డాయి. అసెంబ్లీ సమావేశాలు, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈవెంట్స్ వాయిదా వేస్తున్నట్టు పోలీస్ నియామక మండలి ఓ ప్రకటనలో తెలిపింది. కొత్త తేదీలను తర్వాత ప్రకటించనున్నట్టు వెల్లడించింది.

PRESS NOTE

WEBSITE

=========================

UPDATE 01-03-2023

కానిస్టేబుల్ పోస్టుల పీఎంటీ / పీఈటీ పరీక్ష కాల్ లెటర్ విడుదల

కానిస్టేబుల్ పోస్టుల పీఎంటీ / పీఈటీ పరీక్ష తేదీ: 14/03/2023

DOWNLOAD CALL LETTER

WEBSITE

=========================

UPDATE 28-02-2023

ఎస్సై పోస్టుల ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల

CLICK FOR RESULTS

FINAL KEY PAPER-1

FINAL KEY PAPER-2

PRESS NOTE

WEBSITE

=========================

UPDATE 21-02-2023

కానిస్టేబుల్ పోస్టుల పీఎంటీ/ పీఈటీ మరియు తుది రాత పరీక్షల అప్డేట్ ఇదే 

ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ / ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ తేదీని ఏపీఎస్ఎల్పీఆర్బీ విడుదల చేసింది. మార్చి 13, 2023 నుంచి పీఎంటీ / పీఈటీని నిర్వహించనున్నట్లు సంస్థ అధికారులు సంబంధిత వెబ్సైట్లో ప్రకటన విడుదల చేశారు. స్టేజీ 2 దరఖాస్తు నమోదు ప్రక్రియ ఫిబ్రవరి 20న ముగియడంతో తదుపరి రిక్రూట్మెంట్ వివరాలను ప్రకటనలో పొందుపరిచారు. పీఎంటీ/ పీఈటీ కాల్ లెటర్ లను మార్చి 01, 2023 నుంచి మార్చి 10, 2023 వరకు వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ముఖ్యమైన తేదీలు:

పీఎంటీ / పీఈటీ పరీక్ష కాల్ లెటర్ విడుదల: 01/03/2023 నుండి ప్రారంభం  

పీఎంటీ / పీఈటీ పరీక్ష: 13/03/2023

తుది రాత పరీక్ష: ఏప్రిల్ చివరి వారం    

PRESS NOTE

WEBSITE

=========================

UPDATE 20-02-2023

ఎస్సై పోస్టుల ప్రిలిమినరీ పరీక్ష యొక్క ప్రిలిమినరీ ‘కీ’లు విడుదల

PRELIMINARY KEY PAPER-1

PRELIMINARY KEY PAPER-2

PRESS NOTE

WEBSITE

=========================

UPDATE 19-02-2023

ఎస్సై పోస్టుల పరీక్ష ప్రశ్నాపత్రం 

పరీక్ష తేదీ: 19/02/2023  

PAPER-1 QP-BOOKLET-CODE-A-SET-CODE-A2

PAPER-1 QP-BOOKLET-CODE-A

PAPER-1-SOLUTIONS-BOOKLET-CODE-A

PAPER-1 QP-BOOKLET-CODE-B-SET-CODE-A2

PAPER-2 QP-BOOKLET-CODE-C

PAPER-2 QP-BOOKLET-CODE-B

=========================

UPDATE 13-02-2023

స్టేజ్-II ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ తేదీలు: 13/02/2023 నుండి 20/02/2023 వరకు

APPLICATION

USER GUDIE FOR APPLICATION

WEBSITE

=========================

UPDATE 05-02-2023

ఎస్సై పోస్టుల పరీక్ష హాల్ టికెట్లు విడుదల

పరీక్ష తేదీ: 19-02-2023

హాల్ టికెట్ల డౌన్లోడ్ కి అవకాశం: 05.02.2023 నుండి 15.02.2023 వరకు

DOWNLOAD HALL TICKETS

WEBSITE

=========================

UPDATE 05-02-2023

కానిస్టేబుల్ పోస్టుల పరీక్ష ఫలితాలు విడుదల

కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాలను ఏపీ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. ఫలితాలను ఏపీఎస్ఎల్పీఆర్బీ (APSLPRB) వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఆ సంస్థ అధికారులు తెలిపారు.

కానిస్టేబుల్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4,59,182 మంది అభ్యర్థులు హాజరుకాగా, వారిలో 95,208 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 7వ తేదీ వరకు ఆన్లైన్లో ఓఎంఆర్ షీట్లు అందుబాటులో ఉంటాయని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది.

స్టేజ్-II ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ తేదీలు: 13/02/2023 నుండి 20/02/2023 వరకు

PRESS NOTE

CLICK FOR RESULTS

CLICK FOR FINAL KEY

WEBSITE

=========================

UPDATE 22-01-2023

కానిస్టేబుల్ పోస్టుల పరీక్ష ప్రిలిమినరీ ‘కీ’ విడుదల

పరీక్ష తేదీ: 22/01/2023 

CLICK FOR PRELIMINARY KEY

QUESTION PAPER – CODE A

QUESTION PAPER – CODE B

QUESTION PAPER – CODE C

QUESTION PAPER – CODE D

PRESS NOTE

WEBSITE

=========================

UPDATE 22-01-2023

కానిస్టేబుల్ పోస్టుల పరీక్ష ప్రశ్నాపత్రం మరియు ‘కీ’

పరీక్ష తేదీ: 22/01/2023  

QUESTION PAPER CODE – A WITH KEY

QUESTION PAPER CODE – B

QUESTION PAPER CODE – C

QUESTION PAPER CODE – D

=========================

UPDATE 12-01-2023

కానిస్టేబుల్ పోస్టుల పరీక్ష హాల్ టికెట్లు విడుదల

పరీక్ష తేదీ: 22-01-2023

హాల్ టికెట్ల డౌన్లోడ్ కి అవకాశం: 12.01.2023 నుండి 20.01.2023 వరకు

DOWNLOAD HALL TICKETS

WEBSITE

=========================

UPDATE 25-12-2022

Last date for receipt of application for posts of SCT PCs (Civil and APSP) is extended to 5 PM on 07.01.2023. 

కానిస్టేబుల్ అభ్యర్థుల వయోపరిమితి రెండేళ్లు పెంచుతూ ఇ-గెజెట్‌ విడుదల

DIRECT RECRUITMENT - RAISING OF UPPER AGE LIMIT BY 2 YEARS FOR ONGOING RECRUITMENT OF SCT PCs (CIVIL / APSP) THROUGH SLPRB, AP

SLPRB, AP ద్వారా కొనసాగుతున్న SCT PCల (సివిల్ / APSP) రిక్రూట్‌మెంట్ కోసం 2 సంవత్సరాల వయస్సు పరిమితిని పెంచుతూ ఇ-గెజెట్‌ విడుదల

DOWNLOAD E-GAZETTE

=========================

UPDATE 23-12-2022

SI, కానిస్టేబుల్ అభ్యర్థుల వయోపరిమితి రెండేళ్లు పెంచుతూ నిర్ణయం

కానిస్టేబుల్ ఉద్యోగాలకు 26 ఏళ్లున్న జనరల్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST, BC, EWS అభ్యర్థులు 31 ఏళ్లలోపు వారంతా దరఖాస్తు చేసుకోవచ్చు. అటు SI ఉద్యోగాలకు 29 ఏళ్లున్న జనరల్ అభ్యర్థులు.. SC, ST, BC, EWS కేటగిరీల్లో 34 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేయవచ్చు.

=========================

UPDATE 28-11-2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో  పోలీసు నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ విభాగాలకు సంబంధించి మొత్తంగా 6,100 కానిస్టేబుల్, 411 ఎస్సై పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వాటిలో 315 ఎస్ఐ, 96 రిజర్వ్ సన్స్పెక్టర్, 3,580 కానిస్టేబుల్ (సివిల్), ఏపీఎస్పీలో 2,520 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 22, ఎస్సై పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమనరీ రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఎస్ఐ పోస్టులకు డిసెంబరు 14 నుంచి జనవరి 18 వరకు దరఖాస్తులు స్వీకరించగా.. ఫిబ్రవరి 19న ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుంది.

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్/తత్సమాన ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెయిన్ పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* ప్రిలిమినరీ టెస్ట్ లో మొత్తం 200 మార్కులకు 200 ప్రశ్నలు ఇస్తారు. అరిథ్మెటిక్, రీజనింగ్ / మెంటల్ఎబిలిటీ, జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

* ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో భాగంగా సివిల్ ఎస్సై అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు / లాంగ్జంప్ ఈవెంట్లు ఉంటాయి.

* ఏపీఎస్సీ ఎస్సై అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి.

* సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు / లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి. 

* ఏపీఎస్సీ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి. దరఖాస్తు ఫీజు:

1. ఎస్సై అభ్యర్థులకు రూ.600.

2. కానిస్టేబుల్ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

=======================

కానిస్టేబుల్ పోస్టుల వివరాలు:  

కానిస్టేబుల్ (సివిల్): 3580 పోస్టులు

కానిస్టేబుల్ (ఏపీఎస్పీ): 2520 పోస్టులు

పోస్టుల దరఖాస్తు ప్రారంభ తేదీ: 30-11-2022

దరఖాస్తు చివరి తేదీ: 28-12-202207-01-2023

ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్ డౌన్లోడ్ ప్రారంభం: 12-01-2023 

పరీక్ష తేదీ: 22-01-2023 

NOTIFICATION

USER GUIDE FOR APPLICATION

APPLY HERE

PAYMENT

=======================

ఎస్సై పోస్టుల వివరాలు:

ఎస్ఐ (సివిల్): 315 పోస్టులు

రిజర్వ్ ఎస్ఐ (ఏపీఎస్పీ): 96 పోస్టులు

దరఖాస్తు ప్రారంభ తేదీ: 14-12-2022

దరఖాస్తు చివరి తేదీ: 18-01-2023

ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్ డౌన్లోడ్ ప్రారంభం: 05-02-2023 

పరీక్ష తేదీ: 19-02-2023

NOTIFICATION

USER GUIDE FOR APPLICATION

APPLY HERE

PAYMENT

=======================

RECRUITMENT PAGE

COMBINED NOTIFICATION

WEBSITE

=========================

ఆంధ్రప్రదేశ్ లో పోలీసు ఉద్యోగాల భర్తీకి సీఎం  ఆమోదం తెలిపారు. దాదాపు 6,511 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏపీస్పీలో 2,520 కానిస్టేబుల్, 3,580 సివిల్ కానిస్టేబుల్, 315 సివిల్ ఎస్ఐ, 96 రిజర్వ్ ఎస్ఐ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం ముద్ర వేశారు. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.

రిజర్వ్ ఎస్ఐ పోస్టులు: 96

సివిల్ ఎస్ఐ పోస్టులు: 315

సివిల్ కానిస్టేబుల్ పోస్టులు: 3580

ఏపీస్పీ కానిస్టేబుల్ పోస్టులు: 2520

Home Department – Recruitment of 6511 Civil (PC + SI) and 4 I.P. Battalions (PC + RSI) Strength (3895 + 2616) – Administrative Sanction – Orders – Issued.

G.O.Ms.No.153, Dated: 20.10.2022

DOWNLOAD G.O. 153

Previous
Next Post »
0 Komentar

Google Tags