Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APPSC Recruitment 2022: Apply for 45 Various Non-Gazetted Posts – Details Here

 

APPSC Recruitment 2022: Apply for 45 Various Non-Gazetted Posts – Details Here

ఏపీపీఎస్సీ: వివిధ నాన్-గెజిటెడ్ పోస్టుల (45) నోటిఫికేషన్ విడుదల - వివరాలు ఇవే

ఏపీ ప్రభుత్వ శాఖల్లో 45 నాన్-గెజిటెడ్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో వివిధ నాన్ గెజిటెడ్ (జనరల్/ లిమిటెడ్ రిక్రూట్ మెంట్) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. 11/2022 నోటిఫికేషన్ కింద 45 నాన్ గెజిటెడ్ ఖాళీలను భర్తీ చేయనుంది.

విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

1. శాంపిల్ టేకర్ (ఏపీ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ & ఫుడ్ (హెల్త్) సబ్-సర్వీస్): 12 పోస్టులు

2. డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్-2 (ఏపీ జువెనైల్ వెల్ఫేర్ కరెక్షనల్ సబ్ సర్వీస్): 03 పోస్టులు

3. టెక్నికల్ అసిస్టెంట్ (జియో ఫిజిక్స్) (ఏపీ గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీస్): 04 పోస్టులు

4. అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ (ఏపీ ఫిషరీస్ సబ్ సర్వీస్): 03 పోస్టులు

5. టౌన్ ప్లానింగ్ & బిల్డింగ్ ఓవర్ సీస్ (ఏపీ టౌన్, కంట్రీ ప్లానింగ్): 02 పోస్టులు

6. జూనియర్ ట్రాన్స్ లేటర్ (తెలుగు) (ఏపీ ట్రాన్స్ లేషన్ సబార్డినేట్ సర్వీస్): 01 పోస్టు

7. ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ (ఏపీ ఇండస్ట్రియల్ సబార్డినేట్ సర్వీస్): 08 పోస్టులు

8. టెక్నికల్ అసిస్టెంట్ (ఏపీ మైన్స్ & జియాలజీ సబ్ సర్వీస్): 04 పోస్టులు 

9. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ & ఫుడ్ (హెల్త్) అడ్మినిస్ట్రేషన్ సబార్డినేట్ సర్వీస్): 08 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 45.

అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, శానిటరీ ఇన్ స్పెక్టర్స్ ట్రైనింగ్ సర్టిఫికెట్, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత.

వయస్సు: 01.07.2022 నాటికి 18 - 42 సంవత్సరాల (జిల్లా ప్రొబేషన్ ఆఫీసర్ పోస్టులకు 25 - 42 సంవత్సరాలు) మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష (పేపర్-1 & పేపర్-2), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.330.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం: 11-10-2022.

ఫీజు చెల్లింపు చివరి తేదీ: 01-11-2022.

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02-11-2022.

NOTIFICATION

APPLY HERE

WEBSITE

=======================

APPSC Recruitments 2022: వివిధ కేటగిరీల్లోని 378 పోస్టుల భర్తీకి 11 నోటిఫికేషన్లు విడుదల – పూర్తి వివరాలు ఇవే

CLICK HERE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags