TS: SSC Public Exams 2022-23 - Schedule Released
టిఎస్: పదవ
తరగతి పబ్లిక్ పరీక్షలు 2022-23 - షెడ్యూల్ విడుదల
====================
UPDATE 12-01-2023
పదవ తరగతి
ప్రశ్నపత్రాల్లో వ్యాసరూప ప్రశ్నల సెక్షన్ లో స్వల్పంగా ఛాయిస్ పెంపు
పదవ తరగతి
ప్రశ్నపత్రాల్లో వ్యాసరూప ప్రశ్నల సెక్షన్ లో స్వల్పంగా ఛాయిస్ పెంచారు. ఆరు
ప్రశ్నల్లో నాలుగింటికి సమాధానాలు రాయాలి. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి
కరుణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
గత నెల 28న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వ్యాసరూప ప్రశ్నల సెక్షన్ల
లో ఇంతకుముందు ఇంటర్నల్ ఛాయిస్ మాత్రమే ఉంది. అంటే ప్రతి ప్రశ్నలో ఏ లేదా బి అని
రెండు ప్రశ్నలిస్తారు. అందులో ఏదో ఒకదానికి జవాబు రాయాలి. దీనిపై విమర్శలు
వచ్చాయి. రెండేళ్లపాటు కరోనా కారణంగా ప్రత్యక్ష తరగతులకు దూరమై...అభ్యసన
సామర్థ్యాలు తగ్గాయని.. పరీక్షల విధానంలో మార్పులు చేయాలని.. ఛాయిస్ పెంచాలని
ఉపాధ్యాయ సంఘాల నుంచి ఒత్తిడి రావడంతో తాజాగా ఇంటర్నల్ ఛాయిస్ ను తొలగించింది.
ఆరు
ప్రశ్నల్లో నాలుగింటికి సమాధానాలు రాయాలని పేర్కొంది. దీనివల్ల మిగిలిన రెండు
సెక్షన్లలో ఒక్కో ప్రశ్నకు మార్కుల కేటాయింపు మారింది. ఈ మార్పు తెలుగు, ఆంగ్లం, హిందీ సబ్జెక్టులకు
ఉండదు. మిగిలిన భాషేతర సబ్జెక్టులైన గణితం, సైన్స్, సోషల్లకు... అదీ వచ్చే ఏప్రిల్లో జరిగే వార్షిక పరీక్షలతో
పాటు 2023-24
విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో
పేర్కొన్నారు. ఈ మార్పులన్నీ తొమ్మిదో తరగతికీ వర్తిస్తాయి.
ఇక నుంచి 9, 10 తరగతులకు ఆరు పేపర్లతోనే పరీక్షలు
రాష్ట్రంలో
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ 3 నుంచి పది పరీక్షలు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలిపారు.
తొమ్మిది, పదో తరగతి పరీక్షల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు
తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక నుంచి 9, 10 తరగతులకు ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈమేరకు
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఒక్కో
సబ్జెక్ట్ పరీక్షలకు 80, ఫార్మెటివ్
అసెస్మెంట్ కు 20 మార్కులు కేటాయిస్తున్నట్లు
తెలిపింది. సైన్స్ పేపర్లో ఫిజిక్స్, బయోలజీకి
చెరి సగం మార్కులు ఉంటాయని వెల్లడించింది. సైన్స్ పరీక్షకు 3.20 నిమిషాల సమయం కేటాయించగా.. మిగతా అన్ని సబ్జెక్టులకు 3 గంటలు ఉంటుందని పేర్కొంది.
SCHOOL EDUCATION DEPARTMENT –Examination
reforms for classes IX and X from the
academic year 2022-23 onwards – Orders
-Issued.
G.O. Ms. No.33, Dated 28.12.2022.
0 Komentar