Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TSPSC: Group-2 - All the Details for 783 Posts

 

TSPSC: Group-2 -All the Details for 783 Posts

టీఎస్ పీఎస్సీ: 783 గ్రూప్-2 పోస్టులు – పూర్తి వివరాలు ఇవే  

======================

UPDATE 28-12-2023

TSPSC: గ్రూప్- 2 పరీక్షలు మళ్లీ వాయిదా

తెలంగాణ రాష్ట్రం లో గ్రూప్- 2 పరీక్షలు మళ్లీ వాయిదా అయ్యాయి. జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు TSPSC బుధవారం రాత్రి ప్రకటించింది. పరీక్ష తేదీలను తర్వాత వెల్లడిస్తామని స్పష్టం చేసింది. మొత్తం 783 గ్రూప్- 2 పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.

తొలుత విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్ -2 పరీక్ష జరగాల్సి ఉండగా.. అప్పుడు వరుసగా ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో గ్రూప్ -2 పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఆందోళనలతో వాయిదా పడ్డాయి.

ఆ తర్వాత నవంబర్ 2, 3 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న వేళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో రెండోసారి వాయిదా వేశారు. తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించడం, TSPSC ఛైర్మన్, సభ్యుల రాజీనామాల నేపథ్యంలో నెలకొన్న తాజా పరిస్థితులతో మరోసారి గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడ్డాయి.

WEBNOTE

WEBSITE

======================

UPDATE 28-02-2023

గ్రూప్-2 పరీక్షల తేదీలను టీఎస్ పీఎస్సీ ఖరారుచేసింది. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్షకు వారం రోజుల ముందు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే.

పరీక్ష తేదీలు: 29/08/2023 & 30/08/2023  

WEB NOTE

WEBSITE

======================

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలు నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రభుత్వం తాజాగా గ్రూప్-2 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 783 పోస్టులు గ్రూప్-2 ద్వారా భర్తీ చేయనున్నట్టు టీఎస్ పీఎస్సీ వెల్లడించింది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 2023, జనవరి 18 నుంచి దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది.

గ్రూప్-2లోని పోస్టుల వివరాలు

గ్రూప్-2లో 663 ఉద్యోగాలకు ఆర్థికశాఖ అనుమతి ఇవ్వగా.. తాజా చేర్పుల అనంతరం ఆ సంఖ్య 783 కు చేరింది. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-3, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, డిప్యూటీ తహసీల్దార్ (నాయిబ్ తహసీల్దార్), సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-2, జూనియర్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్ (కో-ఆపరేటివ్ సబ్ సర్వీసెస్), అసిస్టెంట్ రిజిస్ట్రార్ (కో- ఆపరేటివ్ సబ్ సర్వీసెస్), అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (మండల పంచాయతీ అధికారి), ఎక్సెజ్ సబ్ ఇన్ స్పెక్టర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (పీఆర్), అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ (హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్), ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఎండోమెంట్), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (సెక్రెటేరియట్, లెజిస్లేచర్, ఫైనాన్స్, లా).

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 18/01/2023

దరఖాస్తులకు చివరి తేదీ: 16/02/2023    

======================

APPLY HERE

WEB NOTE

NOTIFICATION

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags