Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Know the Brief History of the ‘Golden Globe’ Awards

 

Know the Brief History of the ‘Golden Globe’ Awards

‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డుల చరిత్ర: ఎవరు, ఎలా ప్రారంభించారు? మొదటి అవార్డు ఎవరు అందుకున్నారు? ఏ ఏ భారతీయ చిత్రాలకు ఈ అవార్డు వరించింది?

ఆమెరికా అవతలి  మార్కెట్  సినిమా వార్తలను అందించేందుకు అప్పటి ఫిల్మ్ జర్నలిస్టులు, ఫొటో జర్నలిస్టులు కలిసి లాభాపేక్ష లేకుండా స్థాపించిన సంస్థే ఈ హెచ్. ఎఫ్. పి. ఎ. ఆ అసోసియేషన్ 1943లో మొదలైంది. 'ఆస్కార్ వంటి అవార్డులను ఇవ్వాలనుకున్న ఆ అసోషియేషన్ మరుసటి ఏడాది నుంచే 'గోల్డెన్ గ్లోబ్’ శ్రీకారం చుట్టింది.

అవార్డు అందుకున్న తొలి వ్యక్తి సెసిల్ బ్లౌంట్ డిమిల్లే

అవార్డుల విస్తరణ ....

తొలుత కొన్ని కేటగిరీల్లోనే అవార్డులు ఇచ్చిన హెచ్. ఎఫ్. పి. ఎ. 1950లో వినోదరంగానికి విశేష సేవ చేసిన వారిని గుర్తించేందుకుగాను 'ఇంటర్నేషనల్ ఫిగర్' పేరుతో ఓ పురస్కారాన్ని తీసుకొచ్చింది. ఆ జాబితాలో అవార్డు అందుకున్న తొలి వ్యక్తి సెసిల్ బ్లౌంట్ డిమిల్లే (Cecil Blount DeMille). కొన్నాళ్లకు ఆ అవార్డు పేరు కూడా సెసిల్ బ్లౌంట్ డిమిల్లేగా మారింది. 1956లో బుల్లితెరకు సంబంధించి ఉత్తమ సిరీస్, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి విభాగాలు మొదలయ్యాయి. 1963లో 'మిస్ గోల్డెన్ గ్లోబ్ / మిస్టర్ గోల్డెన్ గ్లోబ్' అనే పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ రెండు పేర్లను కలిపి 2018లో 'గోల్డెన్ గ్లోబ్ అంబాసిడర్ గా మార్చారు. విజేతలను వేదికపైకి తీసుకెళ్లి, ట్రోఫీని అందించడం వారి పని. ఎక్కువగా సెలబ్రిటీ పిల్లలే అంబాసిడర్ గా వ్యవహరిస్తుంటారు. 2007లో 'బెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్' విభాగాన్ని పరిచయం చేశారు. ప్రస్తుతం 25 కేటగిరీల్లో ఈ అవార్డులను అందిస్తున్నారు. 2009లో 'ది న్యూయార్క్ సొసైటీ అవార్డ్స్' అనే అసోసియేషన్తో కలిసి హెచ్. ఎఫ్. పి. ఎ. గోల్డెన్ గ్లోబ్ ప్రతిమ రూపంలో మార్పులు చేసింది. ప్రస్తుతం గోల్డెన్ గ్లోబ్ ట్రోఫీ బరువు 7.8 పౌండ్లు (సుమారు 3.5 కేజీలు). ఎత్తు.. 11.5 అంగుళాలు.

అర్హత

నామినేషన్లో నిలిచే ప్రతి సినిమా నిడివి కనీసం 70 నిమిషాలు ఉండాలి. గ్రేటర్ లాస్ఏంజెల్స్ ప్రాంతంలోని థియేటర్లలో కనీసం ఆ చిత్రం 7 రోజులు ప్రదర్శితమై ఉండాలి. 'బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్' కేటగిరీ చిత్రాలకు ఆ నిబంధనలేదు. ఈ విభాగంలో నామినేట్ అయ్యే సినిమాలు అవి రూపొందిన దేశంలో ముందుగా విడుదలకావాలి. ఆయా చిత్రాల్లోని సంభాషణలు ఇంగ్లిష్ లో  చాలా తక్కువ ఉండాలి. ఒకవేళ, సెన్సార్ కారణంగా మాతృ దేశంలో ఏదైనా సినిమా విడుదలకు ఆటంకం వచ్చినప్పుడు అది యునైటెడ్ స్టేట్స్ లో  వారం పదర్శితమైతే నామినేషన్ కు అర్హత లభిస్తుంది.

భారతీయ చిత్రాలు..

1959 నుంచి భారతీయ చిత్రాలు 'గోల్డెన్ గ్లోబ్ కు పరిచయమయ్యాయి. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి తొలిసారిగా ఆ అవార్డులకు నామినేట్ అయిన చిత్రం 'దో ఆంఖే బారా హాత్ (హిందీ). ఆ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన 'సామ్యుయేల్ గోల్డ్విన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు' దక్కించుకుంది. 1983లో ఐదు విభాగాలకు నామినేట్ అయిన 'గాంధీ' చిత్రం అన్నింటిలోనూ అవార్డులు పొందింది. నేషనల్ ఫిల్మ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్మించిన చిత్రాల్లో ఇది ఒకటి (దర్శకుడు, నటీనటులు భారతీయులు కాదు). 1961లో 'అపుర్ సన్స్కార్ (బెంగాలీ),1989లో 'సలామ్ బాంబే' (హిందీ), 2001లో 'మాన్సన్ వెడ్డింగ్' (హిందీ) చిత్రాలు నామినేట్ అయ్యాయి.

రెహమాన్ - కీరవాణి

80వ 'గోల్డెన్ గ్లోబ్ ' పురస్కారాలకు ఉత్తమ చిత్రం (ఆంగ్లేతర భాషా విభాగం), ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో 'ఆర్ఆర్ఆర్' నామినేట్ కాగా  'నాటు నాటు' పాటకుగాను అవార్డు వరించింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి ఈ పురస్కారం అందుకున్న తొలి వ్యక్తిగా సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి (MM Keeravani) నిలిచారు. ఆ అవార్డు అందుకున్న తొలి భారతీయ వ్యక్తిగా సంగీత దర్శకుడు ఎ. ఆర్. రెహమాన్ నిలిచిన సంగతి తెలిసిందే. 2009లో వచ్చిన 'స్లమ్ డాగ్ మిలీనియర్ సినిమాకుగాను 'బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో అవార్డు అందుకున్నారాయన.

ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్' సినిమా ఓపెన్ కేటగిరీలో ఆస్కార్కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' ఏదో ఒక విభాగంలో ఆస్కార్ సాధిస్తుందని నిన్నమొన్నటి వరకు సినీ అభిమానులంతా భావించారు. ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్ అవార్డురాకతో 'ఆస్కార్ ఖాయం అంటున్నారు.

===================

'ఆర్ఆర్ఆర్' - 'నాటు నాటు' పాటకు ఒరిజినల్ సాంగ్ విభాగం లో 'గోల్డెన్ గ్లోబ్' అవార్డు

CLICK HERE

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags