TS: LAWCET, PGL CET-2023: All the
Details
టీఎస్
లాసెట్,
పీజీఎల్ సెట్-2023: పూర్తి వివరాల ఇవే
======================
తెలంగాణలో ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్, పీజీఎల్ సెట్ షెడ్యూల్ ఖరారైంది. మార్చి 1న లాసెట్, పీజీఎల్ సెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలంగాణ
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి వెల్లడించారు. దీనికి సంబంధించిన
షెడ్యూల్ ను ఉస్మానియా యూనివర్సిటీ వీసీ
డి. రవిందర్, లాసెట్ కన్వీనర్ బి. విజయలక్ష్మీతో
కలిసి ఆయన విడుదల చేశారు. మార్చి 2 నుంచి ఏప్రిల్ 6 వరకు లాసెట్, పీజీఎల్ సెట్కు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య
రుసుంతో మే 3 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మే 16 నుంచి హాల్టికెట్లు
జారీ చేయనున్నారు. మే 25న పరీక్ష నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం అధికారిక
వెబ్సైట్ను సందర్శించవచ్చని అధికారులు సూచించారు.
నోటిఫికేషన్ విడుదల
తేదీ: 01-03-2023
దరఖాస్తుకు ప్రారంభ
తేదీ: 02-03-2023
దరఖాస్తుకు
చివరి తేదీ: 06-04-2023
ఆలస్య
రుసుంతో దరఖాస్తుకు చివరి తేదీ: 03-05-2023
హాల్
టికెట్లు విడుదల: 16-05-2023 నుంచి
పరీక్ష తేదీ:
25-05-2023
======================
======================
0 Komentar