Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Nokia New Phone: Nokia C12 Pro with Android 12 (Go Edition) Launched in India – Details Here

 

Nokia New Phone: Nokia C12 Pro with Android 12 (Go Edition) Launched in India – Details Here

నోకియా కొత్త ఫోన్: ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్)తో నోకియా సి12 ప్రో విడుదల – ధర & ఫీచర్ల వివరాలు ఇవే

========================

ప్రముఖ మొబైల్ సంస్థ నోకియా కొత్తగా సీ12 ప్రో (Nokia C12 Pro) అనే బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను హెచ్ఎండీ గ్లోబల్ భారత్ లో  విడుదల చేసింది. రెండు స్టోరేజ్, మూడు రంగుల ఆప్షన్లలో ఇది అందుబాటులో ఉంది. ఆక్టాకోర్ ప్రాపెసర్ ను  అమర్చారు. 6.3 అంగుళాల హెచ్ డీ + స్క్రీన్ ఉంటుంది.

మొబైల్ ధర..

ఈ ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 2జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ.6,999. 3జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న వేరియంట్ ధర రూ.7,499. ఈ రెండు ఫోన్లు 2జీబీ వర్చువల్ ర్యామ్ ను సపోర్ట్ చేస్తాయి. లైట్ మింట్, చార్ కోల్, డార్క్ సియాన్ రంగుల్లో ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

ఫీచర్ల వివరాలు ఇవే

నోకియా సీ12 ప్రోలో 60Hz. రీఫ్రెష్ రేటుతో 6.3 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ, హెచీ+ రెజల్యూషన్తో కూడిన తెరను అమర్చారు. డ్యుయల్ సిమ్ను సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్) ఓఎస్ ను ఇస్తున్నారు. రెండేళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్లు ఇస్తారు. అలాగే రెండేళ్ల రీప్లేస్మెంట్ గ్యారెంటీని కూడా ఆఫర్ చేస్తున్నారు. వెనుక భాగంలో ఎల్ఎస్ఈడీ ఫ్లాష్తో కూడిన 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ముందు భాగంలో సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్ కెమెరాను ఇస్తున్నారు. 10వాట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. 

PHONE DETAILS

PURCHASE LINK

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags