Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS 2023: Summer Holidays Dates – SA2 Exams Dates – Next Academic Year Start Date – Details Here

 

TS 2023: Summer Holidays Dates – SA2 Exams Dates – Next Academic Year Start Date – Details Here

తెలంగాణ 2023: వేసవి సెలవుల తేదీలు – SA2 పరీక్షల తేదీలు – 2023-24 విద్యా సంవత్సరం ప్రారంభ తేదీల  వివరాలు ఇవే

==========================

తెలంగాణ రాష్ట్రంలోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల‌కు ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వ‌ర‌కు ప్ర‌భుత్వం వేస‌వి సెలవులు ప్ర‌క‌టించింది. 2023-24 విద్యాసంవ‌త్స‌రానికి గానూ జూన్ 12న పాఠ‌శాలలు తిరిగి తెరుచుకోనున్నాయి.

1వ తరగతి నుంచి 9వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు SA – II పరీక్షలు ఏప్రిల్ 12 నుంచి 20వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. ఒక‌టి నుంచి ఐదో త‌ర‌గ‌తి వ‌ర‌కు ఉద‌యం 9:30 నుంచి మ‌ధ్యాహ్నం 12 వ‌ర‌కు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఆరు నుంచి ఎనిమిది త‌ర‌గ‌తుల‌కు 9:30 నుంచి మ‌ధ్యాహ్నం 12:15 గంట‌ల వ‌ర‌కు, తొమ్మిదో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఉద‌యం 9:30 నుంచి మ‌. 12:30 గంట‌ల వ‌ర‌కు SA – II పరీక్షలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు విద్యాశాఖ అధికారులు ప్ర‌క‌టించారు.

ఇక 21 నుంచి 24వ తేదీ వ‌ర‌కు ప‌రీక్షా ప‌త్రాల‌ను మూల్యాంక‌నం చేయ‌నున్నారు. 25వ తేదీన పేరెంట్ టీచ‌ర్ మీటింగ్ నిర్వ‌హించి, విద్యార్థుల మార్కుల‌ను త‌ల్లిదండ్రుల‌కు తెలిపి, వేస‌వి సెలవులు ప్ర‌క‌టించ‌నున్నారు.

SA-2 పరీక్షల తేదీలు: 12/04/2023 నుండి 20/04/2023 వరకు

వేసవి సెలవుల తేదీలు: 25/04/2023 నుండి 11/06/2023 వరకు

2023-24 విద్యా సంవత్సరం ప్రారంభ తేదీ: 12/06/2023 

==========================

Previous
Next Post »
0 Komentar

Google Tags