Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Women’s Premier League 2023: Mumbai Indians Beat Delhi Capitals to Lift Inaugural Title

 

Women’s Premier League 2023: Mumbai Indians Beat Delhi Capitals to Lift Inaugural Title

మహిళల ప్రీమియర్ లీగ్ 2023: ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి మొట్టమొదటి మహిళల ప్రీమియర్ లీగ్ ఛాంపియన్ గా ముంబై ఇండియన్స్

========================

ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ముంబయి ఇండియన్స్ ఫ్రాంఛైజీ.. మొట్టమొదటి మహిళల ప్రీమియర్ లీగ్ ఛాంపియన్ గా అవతరించింది. టోర్నీ ఆరంభం నుంచి మెరుగైన ఆటతో ఆకట్టుకున్న హర్మన్ ప్రీత్ నేతృత్వంలోని ముంబయి.. రసవత్తరంగా సాగిన ఫైనల్లోనూ పైచేయి సాధించింది. దిల్లీకి నిరాశ. పోరాడినా ఆ జట్టుకు పరాభవం తప్పలేదు. బంతితో వాంగ్, హేలీ, అమేలియా.. బ్యాటుతో నీట్ సీవర్ ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించారు.

సీవర్

లక్ష్యం పెద్దదేమీ కాకపోయినా దిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబయి ఛేదన కష్టంగానే సాగింది. 4 ఓవర్లలో 24 పరుగులకే ఓపెనర్లు హేలీ (13), యాస్తిక భాటియా (4)లను ముంబయి కోల్పోయింది. ఆ దశలో సీవర్, హర్మన్ ప్రీత్ నిలిచారు. బ్యాటర్లు దాటిగా ఆడకపోవడంతో సాధించాల్సిన రన్ రేట్ పెరుగుతూ పోయింది. 11 ఓవర్లలో ఆ జట్టు స్కోరు 55 మాత్రమే. ఆ తర్వాత బ్యాటర్లు కాస్త వేగం పెంచినా 16 ఓవర్లలో 95/2తో నిలిచిన ముంబయికి.. చివరి 4 ఓవర్లలో 37 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చేతిలో 8 వికెట్లున్నా ఛేదన కష్టంగానే అనిపించింది. అలాంటి స్థితిలో హర్మన్ ఔటైంది. కానీ దూకుడు పెంచిన సీవర్ అదే ఓవర్లో (17వ) రెండు ఫోర్లు కొట్టింది. 18వ ఓవర్లో శిఖా అయిదు పరుగులే ఇవ్వడంతో మ్యాచ్లో ఉత్కంఠ పెరిగింది. చివరి రెండు ఓవర్లలో 21 పరుగులు చేయాల్సిన స్థితిలో ముంబయిపై ఒత్తిడీ పెరిగింది. కానీ సీవర్ ఓ ఫోర్, అమేలియా కెర్ రెండు ఫోర్లు కొట్టడంతో 19వ ఓవర్లో జొనాసెన్ 16 పరుగులు సమర్పించుకుంది. దీంతో దిల్లీ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.

బౌలింగ్

వాంగ్, అమేలియా, హేలీ సూపర్ బౌలింగ్తో ముంబయి అంతకుముందు దిల్లీకి కళ్లెం వేసింది. నిజానికి దిల్లీ చేసిన 131 కూడా అస్సలు ఊహించని స్కోరే. ఎందుకంటే 79 పరుగులకే 9 వికెట్లు చేజార్చుకున్న ఆ జట్టు ఫైనల్లో చాలా ముందే చేతులెత్తేసినట్లనిపించింది. చివరి జంట.. టెయిలెండర్లు శిఖ పాండే, రాధా యాదవ్ అద్భుత పోరాట పుణ్యమా అని ఆ జట్టు కాస్త పోరాడగలిగే స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దిల్లీ ఆరంభం పేలవం. వాంగ్.. రెండో ఓవర్లోనే షెఫాలి (11), క్యాప్సీ (0)ని ఔట్ చేసి ఆ జట్టుకు షాకిచ్చింది. అయిదో ఓవర్లో జెమీమా (9)ను కూడా వాంగ్ వెనక్కి పంపడంతో దిల్లీ 35/3తో చిక్కుల్లో పడింది. ఈ ముగ్గురూ ఫుల్ స్లకే ఔట్ కావడం విశేషం. అయితే చక్కగా ఆడుతున్న లానింగ్కు కాప్ (18; 21 బంతుల్లో 2x4) తోడవడంతో దిల్లీ కోలుకుంది. 10.2 ఓవర్లలో 73/3తో నిలిచింది. కానీ అనూహ్యంగా గతి తప్పిన ఆ జట్టు 6 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయింది. 16 ఓవర్లలో 79/9తో నిలిచిన దిల్లీ పని అయిపోనట్లేనని భావించారంతా. కానీ ఊహించని విధంగా చెలరేగిన శిఖా, రాధా యాదవ్ అభేద్యమైన ఆఖరి వికెట్కు కేవలం 24 బంతుల్లో 52 పరుగులు జోడించి ఢిల్లీని నిలబెట్టారు.

========================

FINAL HIGHLIGHTS LINK

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags