Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Vidyadhan Scholarship Program 2023 from Sarojini Damodaran Foundation – Details Here

 

Vidyadhan Scholarship Program 2023 from Sarojini Damodaran Foundation – Details Here

'విద్యాదాన్’ ఉపకార వేతనాలు 2023:  పదవ తరగతి ఉత్తీర్ణులైన పేద విద్యార్థులకు ఇంటర్, ఆపై చదువులకు ఉపకార వేతనాల వివరాలు ఇవే

==========================

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 2023 విద్యా సంవత్సరం పదో తరగతిలో 90 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఇంటర్ చదువుతున్న 120 మంది పేద విద్యార్థులకు విద్యాధన్ పేరిట సరోజిని దామోదరన్ ఫౌండేషన్ స్కాలర్షిప్లు అందజేస్తోంది. ఇంటర్లో ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.10 వేల చొప్పున, వారు డిగ్రీలో చేరితే రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకు స్కాలర్షిప్ ఇవ్వనుంది. విద్యార్థుల కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షలలోపు ఉండాలి. ఆసక్తి ఉన్నవారు జూన్ 15లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు 8367751309(ఏపీ), 6300391827(టీఎస్) అనే నంబరుకు ఫోన్ చేయవచ్చు.

విద్యాధన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2023

అర్హత: 90 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థుల కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షలలోపు ఉండాలి.

స్కాలర్షిప్: ఇంటర్లో ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.10 వేల చొప్పున, వారు డిగ్రీలో చేరితే రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకు స్కాలర్షిప్ అందుతుంది.

ఎంపిక విధానం: రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు 15-06-2023; తెలంగాణ విద్యార్థులకు 20-06-2023

స్క్రీనింగ్ టెస్ట్ తేదీ: 02-07-2023 (ఆంధ్రప్రదేశ్); 09-07-2023 (తెలంగాణ) .

ఇంటర్వ్యూ / పరీక్షల తేదీలు: 16 నుంచి 31-07-2023 వరకు (ఆంధ్రప్రదేశ్); 26 నుంచి 31-07-2023 వరకు (తెలంగాణ).

==========================

NOTIFICATION (ANDHRA PRADESH)

NOTIFICATION (TELANGANA)

APPLY HERE

WEBSITE

==========================

Previous
Next Post »
0 Komentar

Google Tags