Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: Two Days Holidays for Educational Institutions Due to Heavy Rain

 

TS: Two Days Holidays for Educational Institutions Due to Heavy Rain

టీఎస్: భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలో విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు

=======================

UPDATE 22-07-2023

తెలంగాణ వ్యాప్తంగా నేడు (జులై 22) విద్యాసంస్థలకు సెలవు

తెలంగాణ లో వర్షాల దృష్ట్యా విద్యాశాఖ మరో సారి కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు శనివారం (జులై 22) సెలవు ప్రకటిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాల దృష్ట్యా ఇప్పటికే గురువారం, శుక్రవారం విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం కూడా సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలకు శుక్రవారం, శనివారం సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.

=======================

జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు శుక్రవారం & శనివారం సెలవు

రాష్ట్రం లో భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు శుక్రవారం, శనివారం సెలవు ప్రకటించింది. ప్రైవేటు సంస్థలు కూడా సెలవులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కార్మికశాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మరి కొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు గురువారం, శుక్రవారం సెలవు ప్రకటించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈరోజు ఉదయం ఆదేశించిన విషయం తెలిసిందే.

=======================

తెలంగాణ రాష్ట్రం లో భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు ప్రభుత్వం సెలవును ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఆదేశాలకు మేరకు సెలవులు ప్రకటించినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి వెల్లడించారు. 

ఈ మేరకు మంత్రి ట్వీట్ చేశారు. ఎడతెరిపి లేని వర్షాల వలన ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండడంతో ఈ మేరకు గురువారం మరియు శుక్రవారం సెలవు రోజులు గా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags