Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ISRO’s ADITYA-L1 Mission Launch – All the Details

 

ISRO’s ADITYA-L1 Mission Launch – All the Details

'ఆదిత్య- ఎల్ 1’ మిషన్ కౌంట్ డౌన్ ప్రారంభం  

======================

లాంచింగ్ తేదీ & సమయం వివరాలు ఇవే - ఆదిత్య-ఎల్1 విశేషాలు ఇవే

======================

ఆదిత్యుడు (సూర్యుడు) పై పరిశోధనల కోసం ISRO చేపడుతున్న మరో ప్రయోగం 'ఆదిత్య- ఎల్ 1 కు రంగం సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో ఈ ప్రయోగానికి శుక్రవారం (సెప్టెంబర్ 1)  మధ్యాహ్నం 12.10 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 23 గంటలకు పైగా ఈ కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగనుంది. శనివారం (సెప్టెంబరు 2) ఉదయం 11.50 గంటలకు ఆదిత్య-ఎల్ 1 ఉపగ్రహాన్ని మోసుకుని పీఎస్ఎల్వీ సీ-57 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగం నేపథ్యంలో ఆదిత్య-ఎల్ 1 ఉపగ్రహ ఆకృతిని తీసుకుని ఇస్రో శాస్త్రవేత్తల బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అటు ఇస్రో చైర్మన్ సోమనాథ్.. సూళ్లూరుపేటలోని చెంగలమ్మ పరమేశ్వరీ ఆలయాన్ని దర్శించుకున్నారు.

సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి మిషన్ ఇదే కావడం విశేషం. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో సూర్యుడిపై అధ్యయనాలను ఇస్రో చేపడుతోంది. ప్రయోగాన్ని వీక్షించేందుకు సాధారణ పౌరులకు ఇస్రో అవకాశం కల్పించింది. ఇందుకోసం ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు రేపు ప్రయోగాన్ని వీక్షించొచ్చు.

======================

ఆదిత్య-ఎల్1 విశేషాలు ఇవే

1. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి మిషన్ ఇది. ఇందులోని శాటిలైట్ బరువు 1500 కిలోలు.

2. భూమి నుంచి సూర్యుని దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్ పాయింట్ 1 (ఎల్ 1) చుట్టూ ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. తద్వారా గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు లభిస్తుంది.

3. ఆదిత్య-ఎల్ 1 మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లనుంది. ఇందులో ప్రధానమైన 'విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ (వీఈఎల్సీ)తో పాటు సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, హైఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, మాగ్నెటోమీటర్ పేలోడ్లను అమర్చనున్నారు.

4. సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్లను రూపొందించారు. ఈ పేలోడ్లు ఎలక్ట్రోమాగ్నెటిక్, మాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో సూర్యుడిలోని పొరలైన ఫొటోస్పియర్, క్రోమోస్పియర్, వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి.

5. ఎల్-1 ప్రదేశానికి ఉన్న సానుకూలతల దృష్ట్యా నాలుగు పరికరాలు నేరుగా సూర్యుడిని అధ్యయనం చేస్తాయి. మిగతా మూడు సాధనాలు.. సమీపంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాల గురించి శోధిస్తాయి.

లాంచింగ్ తేదీ & సమయం: 02/09/2023, 11.50 AM

=========================

YOUTUBE LINK:

https://www.youtube.com/watch?v=_IcgGYZTXQw

=========================

Previous
Next Post »
0 Komentar

Google Tags