Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

PNB Recruitment 2024: Apply for 1025 Specialist Officer Posts – Details Here

 

PNB Recruitment 2024: Apply for 1025 Specialist Officer Posts – Details Here

పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1,025 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.36000 - రూ.78230.

===================

పంజాబ్ నేషనల్ బ్యాంక్, మానవ వనరుల విభాగం... దేశ వ్యాప్తంగా వివిధ శాఖల్లో 1,025 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఫిబ్రవరి 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోచ్చు.

1. ఆఫీసర్-క్రెడిట్ (జేఎంజీ స్కేల్-1): 1000 పోస్టులు

2. మేనేజర్-ఫారెక్స్ (ఎంఎంజీ స్కేల్-II): 15 పోస్టులు

3. మేనేజర్-సైబర్ సెక్యూరిటీ (ఎంఎంజీ స్కేల్-II): 05 పోస్టులు

4. సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ (ఎంఎంజీ స్కేల్-III): 05 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 1,025.

విద్యార్హత: ఖాళీలను అనుసరించి బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీజీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయో పరిమితి: 01.01.2024 నాటికి ఆఫీసర్ పోస్టులకు 21-28 ఏళ్లు; మేనేజర్ పోస్టులకు 25-35 ఏళ్లు; సీనియర్ మేనేజర్ పోస్టులకు 27-38 ఏళ్ల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు ఆఫీసర్ కు రూ.36000-రూ.63840; మేనేజర్ కు రూ.48170 - రూ. 69810; సీనియర్ మేనేజర్ కు రూ.63840 - రూ. 78230.

ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: పార్ట్-1లో రీజనింగ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (50 ప్రశ్నలు- 50 మార్కులు); పార్ట్-2లో ప్రొఫెషనల్ నాలెడ్జ్ (50 ప్రశ్నలు- 100 మార్కులు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష కాల వ్యవధి 120 నిమిషాలు.

దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.59, మిగతా అభ్యర్థులకు రూ.1180.

తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ పరీక్ష కేంద్రాలు: విజయవాడ, వైజాగ్, హైదరాబాద్.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.02.2024.

ఆన్లైన్ దరఖాస్తు కి చివరి తేదీ: 25.02.2024.

===================

NOTIFICATION

APPLY HERE

WEBSITE

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags