Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Amazon ‘Great Summer Sale’ 2024: Dates Announced – Details Here

 

Amazon Great Summer Sale 2024: Dates Announced – Details Here

అమెజాన్ 'గ్రేట్ సమ్మర్ సేల్' 2024 – తేదీలు మరియు ఆఫర్ ల వివరాలు ఇవే

====================

ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఏటా నిర్వహించే గ్రేట్ సమ్మర్ సేల్ (Great Summer Sale) తేదీని తాజాగా ప్రకటించింది. మే 2 మధ్యాహ్నం నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది. అయితే, అమెజాన్ సేల్ ఎప్పుడు ముగుస్తుందనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. ప్రైమ్ మెంబర్లకు మే 1 అర్ధరాత్రి 12 తర్వాత నుంచే సేల్ మొదలుకానుంది. ఈ సేల్లో భాగంగా అందించే డిస్కౌంట్లు, డీల్స్ ను ప్రైమ్ చందాదారులు అందరికంటే ముందుగానే పొందొచ్చు.

గ్రేట్ సమ్మర్ సేల్లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్, వన్ కార్డ్, బ్యాంక్ ఆఫ్ బరోడా డెబిట్ కార్డు/ క్రెడిట్కార్డు దారులకు 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ సదుపాయం కూడా ఉందని కంపెనీ తన వెబ్సైట్లో పేర్కొంది. సేల్ సమయంలో చేసే ఫస్ట్ ఆర్డర్పై ఫ్రీ డెలివరీ అందించడంతో పాటు వెల్కమ్ రివార్డ్ పేరిట 20 శాతం క్యాష్ బ్యాక్ ఇవ్వనుంది.


దుస్తులు, స్మార్ట్ వాచ్ లు, పుస్తకాలు, ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆఫర్లు ఉండనున్నాయి. అమెజాన్ అలెక్సా డివైజ్లు, ఫైర్ టివి, కిండ్లే డివైజుల మీద ఈ సేల్ డిస్కౌంట్లు లభించనున్నాయి. సేల్ సమయంలో యాపిల్, శాంసంగ్, వస్, రెడ్ మి, పోకో, హానర్, టెక్నో వంటి స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది.

====================

WEBSITE

MOBILE APP

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags