AP High Court Recruitment
2025: Apply for 1620 Various Posts in the Judicial Districts of State – Details
Here
ఏపీ జిల్లా
కోర్టుల్లో 1620 వివిధ పోస్టులు – జీత భత్యాలు: నెలకు రూ.20,00 - రూ.1,07,210.
====================
ఆంధ్రప్రదేశ్
జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కార్యాలయ సిబ్బంది ఖాళీల
భర్తీకి ఏపీ హైకోర్టు ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 10 రకాల నోటిఫికేషన్ ద్వారా 1620 పోస్టులను భర్తీ చేయనున్నారు. కంప్యూటర్
ఆధారిత పరీక్షతో పాటు తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
పోస్టుల వివరాలు
1. స్టెనోగ్రాఫర్
గ్రేడ్-3: 80 పోస్టులు
2. జూనియర్
అసిస్టెంట్: 230 పోస్టులు
3. టైపిస్ట్:
162 పోస్టులు
4. ఫీల్డ్
అసిస్టెంట్: 56 పోస్టులు
5. ఎగ్జామినర్:
32 పోస్టులు
6. కాపీయిస్టు:
193 పోస్టులు
7. డ్రైవరు (లైట్
వెహికల్): 28 పోస్టులు
8. రికార్డు అసిస్టెంట్:
164 పోస్టులు
9. ప్రాసెస్
సర్వర్: 24 పోస్టులు
10. ఆఫీస్
సబార్డినేట్: 651 పోస్టులు
మొత్తం ఖాళీల
సంఖ్య: 1,620
అర్హతలు:
పోస్టును అనుసరించి ఏడోతరగతి, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో
పాటు,
టైప్ రైటింగ్ / స్టెనో సర్టిఫికెట్, కంప్యూటర్ పరిజ్ఞానం, డైవింగ్
లైసెన్స్ ఉండాలి.
వయో పరిమితి:
01/07/2025 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్
అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
ఖాళీలను అనుసరించి రూ.20,000 నుంచి రూ.1,07,210 మధ్య ఉంటుంది.
దరఖాస్తు
రుసుం: రూ:800 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.400).
ఎంపిక
విధానం: పోస్టును బట్టి రాతపరీక్ష, స్కిల్
టెస్ట్,
ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక
చేస్తారు.
దరఖాస్తు
విధానం: అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభ తేదీ: 13-05-2025
దరఖాస్తు ప్రక్రియ
చివరి తేదీ: 02-06-2025
====================
NOTIFICATIONS 👇
====================


0 Komentar