AP SPORTS DSC 2025:
Apply for 421 Posts – Details Here
===================
UPDATE 08-08-2025
AP SPORTS DSC 2025:
క్రీడా కోటా డీఎస్సీ పోస్టుల ప్రాథమిక మెరిట్ జాబితా విడుదల
జాబితాలో
ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల 13 అర్ధరాత్రి 12 గంటల్లోపు వెబ్ సైట్ ద్వారానే తెలియజేయాలి. ఇప్పటికే
డీఎస్సీ క్రీడా కోటా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తయ్యింది.
===================
ఆంధ్ర ప్రదేశ్
లో నిర్వహిస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ లో క్రీడాకారుల కోసం 421 పోస్టులు కేటాయించినట్లు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి
రాంప్రసాదొడ్డి తెలిపారు. విద్యార్హత కలిగిన అభ్యర్థులకు ఎలాంటి రాతపరీక్ష లేకుండా
ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించారు.
మెగా
డీఎస్సీలో భాగంగా క్రీడా కోటా నోటిఫికేషన్ ను విజయవాడలోని శాప్ కార్యాలయంలో
బుధవారం ఆయన విడుదల చేశారు. 'రాష్ట్రంలోని అర్హత
కలిగిన క్రీడాకారులంతా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవాలి.
మే 2 నుంచి 31 వరకు 30 రోజుల పాటు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తాం. https://sports.ap.gov.in అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థుల్ని క్రీడా
రంగంలో వారి ప్రతిభ, సీనియారిటీ ఆధారంగా
ఉద్యోగాలకు ఎంపిక చేస్తాం' అని చెప్పారు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుల ప్రారంభ
తేదీ: 02/05/2025
దరఖాస్తులకు చివరి
తేదీ: 31/05/2025
===================
===================


0 Komentar