French Open Men’s Final 2025: Carlos
Alcaraz beats Jannik Sinner to Claim Consecutive Second French Open
ఫ్రెంచ్
ఓపెన్ 2025:
పారిస్ లో వరుసగా రెండో సారి విజేత గా 22 ఏళ్ల కార్లోస్ అల్కరాజ్ – మొత్తంగా 5 గ్రాండ్
స్లామ్ ల విజేత గా అల్కరాజ్
===================
2025 ఫ్రెంచ్
ఓపెన్ టైటిల్ ను స్పెయిన్ యువ కెరటం కార్లోస్ అల్కరాస్ కైవసం చేసుకున్నాడు.
హోరాహోరీగా సాగిన ఫైనల్లో జనిక్ సినర్ పై 4-6, 6-7 (7/4), 6-4, 7-6 (7/3), 7-6
(10/2) తేడాతో అల్కరాస్ విజయం సాధించాడు.
దాదాపు ఐదున్నర గంటలపాటు సాగిన ఈ పోరు రికార్డు సృష్టించింది. సుదీర్ఘంగా సాగిన
ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్ గా ఘనత సాధించింది. ఇంతకుముందు 1982లో 4 గంటల 42 నిమిషాల పాటు మ్యాచ్ జరిగింది.
ప్రస్తుతం
టెన్నిస్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉన్న జనిక్ సినర్ తొలి రెండు సెట్లను
గెలిచి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. వరుసగా రెండో టైటిల్ రోలాండ్ గారోస్ లో తన
ఆధిపత్యాన్ని చాటాలని భావించిన అల్కరాస్ మొదట్లో ఇబ్బంది పడ్డాడు. కానీ, తర్వాత పుంజుకున్న తీరు అమోఘం. మొదటి సెట్ను 6-4 తేడాతో కోల్పోయిన అల్కరాస్ రెండో సెట్లో తీవ్రంగా
పోరాడాడు. అయితే సినర్ దెబ్బకు 6-7 (4/7) స్పెయిన్
కుర్రాడికి ఓటమి తప్పలేదు. దీంతో వరుసగా రెండు సెట్లలో ఓడిపోవడంతో ఇక అల్కరాస్ పని
అయిపోయిందని అంతా భావించారు.
వరుసగా రెండు
సెట్లను కోల్పోయిన తర్వాత టైటిల్ రేసులోకి రావడం తేలికేం కాదు. కానీ, అల్కరాస్ పట్టువదల్లేదు. మూడో సెట్ ను 6-4తో కైవసం చేసుకున్న అతడు.. నాలుగో సెట్లో ఒకదశలో ఓడిపోయే
ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సినర్ విన్నింగ్ పాయింట్ ను బ్రేక్ చేసి ఆ సెట్ ను అల్కరాస్
తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక హోరాహోరీగా సాగిన ఐదో సెట్లోనూ విజయం ఇరువురిని
దోబూచులాడింది. తొలుత రెండు పాయింట్లను సొంతం చేసుకున్న అల్కరాస్ ఆ తర్వాత కాస్త
వెనుకబడ్డాడు. సినర్ పుంజుకుని పోరును టైబ్రేక్ కు తీసుకెళ్లాడు. ఇక్కడ అల్కరాస్
ఏమాత్రం ఉపేక్షించలేదు. వరుసగా టైబ్రేక్ పాయింట్లను సాధించిన అతడు సినర్కు అవకాశం
ఇవ్వకుండా పాయింట్ తో పాటు సెట్ ను (10/2) గెలిచి.. తన ఖాతాలో రెండో ఫ్రెంచ్ ఓపెన్ ను వేసుకున్నాడు. ఈ మ్యాచ్ 5 గంటల 29 నిమిషాలపాటు
ఏకధాటిగా సాగింది.
===================



0 Komentar