SSC Recruitment 2025: Apply for 261
Stenographer Grade ‘C’ & ‘D’ Posts – Details Here
కేంద్ర
ప్రభుత్వ శాఖల్లో 261 స్టెనోగ్రాఫర్
పోస్టులు – పూర్తి వివరాలు ఇవే
==================
న్యూదిల్లీలోని
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎన్ఎస్సీ)... దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో/
విభాగాల్లో/ సంస్థల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి (గ్రూప్ బి, నాన్ గెజిటెడ్), స్టెనోగ్రాఫర్
గ్రేడ్ డి(గ్రూప్ సి) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులను
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్
ఆధారంగా ఎంపిక చేస్తారు.
1. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి (గ్రూప్-బి, నాన్-గెజిటెడ్)
2. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-డి (గ్రూప్-సి)
మొత్తం ఖాళీల
సంఖ్య: 261.
అర్హత:
ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. స్టెనోగ్రఫీలో నైపుణ్యం ఉన్న అభ్యర్థులు
దరఖాస్తుకు అర్హులు.
వయోపరిమితి: 01-08-2025 నాటికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్- సి పోస్టులకు 18-30 ఏళ్లు, గ్రేడ్- డి
పోస్టులకు 18-27 ఏళ్లు మించకూడదు. వివిధ కేటగిరీల
వారీగా వయో సడలింపు కల్పించారు.
ఎంపిక
విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టెనోగ్రఫీలో
స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో జనరల్
ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్ అంశాల్లో
ప్రశ్నలుంటాయి.
దరఖాస్తు
రుసుము: రూ. 100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్మెన్, దివ్యాంగులకు ఫీజు
నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి.
ముఖ్యమైన
తేదీలు.
ఆన్లైన్
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 06-06-2025
ఆన్లైన్
దరఖాస్తులకు చివరి తేదీ: 26-06-2025
కంప్యూటర్ ఆధారిత పరీక్ష షెడ్యూల్: 06-08-2025 నుండి 11-08-2025 వరకు .
==================
===================


0 Komentar