APPSC: Apply for 100 Forest Section Officer
Posts – Details Here
ఏపీలో 100 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు - జీతం: నెలకు రూ.32,670
- రూ.1,01,970
===================
UPDATE 30-08-2025
APPSC: ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల పోస్టుల పరీక్ష హాల్ టికెట్లు విడుదల
పరీక్ష తేదీ: 07-09-2025
===================
ఆంధ్రప్రదేశ్
పబ్లిక్ సర్వీస్ కమిషన్ 100 ఖాళీలతో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ (07/2025)
విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 2025 జులై 28 నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు
చేయవచ్చు.
ఫారెస్ట్ సెక్షన్
ఆఫీసర్ పోస్టులు: 100
అర్హతలు: డిగ్రీ
లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. శారీరక ప్రమాణాలు కూడా తప్పనిసరి. పురుష
అభ్యర్థులకు కనీసం 163 సెం.మీ ఎత్తు, మహిళలకు కనీసం 150 సెం.మీ ఎత్తు ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. ఎన్సీసీ
సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులకు బోనస్ మార్కులు వర్తిస్తాయి.
వయోపరిమితి: 2025 జులై 1 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎస్సీ,
ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు ఉండాలి.
జీతం: నెలకు
రూ.32,670
- రూ.1,01,970
ఎంపిక
ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్ (ఆబ్జెక్టివ్ ఓఎంఆర్ బేస్డ్), మెయిన్స్ ఎగ్జామినేషన్, నడక /
మెడికల్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియేన్సీ టెస్ట్
తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. దరఖాస్తు ఫీజు: ప్రాసెసింగ్ ఫీజు రూ.250, ఎగ్జామినేషన్ ఫీజు రూ.80 మొత్తం 330, ఎస్సీ/ఎస్టీ/ బీసీ/ఎక్ససర్వీసెమెన్, నిరుద్యోగ యువత తదితరులకు ప్రాసెసింగ్ ఫీజు రూ.250.
దరఖాస్తు
విధానం: అభ్యర్థులు ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి.
ముందుగా ఓబీపీఆర్ (One Time Profile Registration) చేయాలి. దరఖాస్తు చేసేటప్పుడు అన్ని వివరాలు ఖచ్చితంగా పూర్తి చేయాలి.
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తు ప్రారంభం: 28/07/2025.
దరఖాస్తుకు
చివరి తేదీ: 17/08/2025.
పరీక్ష తేదీ:
07/09/2025
===================
===================


0 Komentar