Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 18th February Information

                                             పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....
School Assembly 18th February Information

చరిత్రలో ఈరోజు
1911: భారతదేశంలో మొదటిసారిగా ఫ్రీక్వెల్ అనే ఫ్రెంచి దేశస్థుడు అలహాబాదు నుండి నైనీ వరకు విమానాన్ని నడిపాడు.
1946: 18 ఫిబ్రవరి 1946లో ముంబాయిలో ఓడలలోను, రేవులలోను "రాయల్ ఇండియన్ నేవీ"లో పనిచేసే భారతీయ నావికుల సమ్మె, తదనంతర తిరుగుబాటు,
2014: ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లును భారతదేశ లోక్‌సభ ఆమోదించింది.
రాధాకృష్ణ సంప్రదాయాన్ని పరాకాష్ఠకు తీసుకువెళ్ళిన మహా భక్తుడు చైతన్య మహాప్రభు 1486 వ సం.లో జన్మించారు.
బ్యాటరీని ఆవిష్కరించిన ఇటలీ శాస్త్రవేత్త అలెస్సాండ్రో వోల్టా 1745 వ సం.లో జన్మించారు.
ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస 1836 వ సం.లో జన్మించారు.
తెలుగు సినిమా నటుడు, ప్రముఖ నిర్మాత మరియు భారత పార్లమెంటు మాజీ సభ్యుడు దగ్గుబాటి రామానాయుడు 2015 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
సామెత కధ- కుక్కతోక పట్టి గోదారీదాలనుకున్నట్టు
కుక్కలకు నీటిలో ఈదే సామర్థ్యం తక్కువ. అందుకే... కుక్కతోక పట్టుకుని గోదావరినదిని దాటాలనుకోవడం అవివేకమని ఈ సామెత భావం. అలాగే అసమర్థుల నుంచి సహాయం ఆశించినా, వారిని నమ్ముకుని మహాకార్యాన్ని తల పెట్టినా పనులు జరగవనే అర్థంతో ఈ సామెతను చెబుతారు.
మంచి మాట /సుభాషితం:
అత్యంత అదృష్టవంతులు ఎవరంటే అభినందించడం తప్ప అసూయపడటం తెలియనివారు - కన్‌ఫ్యూషియస్‌
వార్తలలోని ముఖ్యాంశాలు
కౌలు రైతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భారీ సాయం ప్రకటించింది. పెట్టుబడి సాయం రూపంలో కుటుంబానికి ఏడాదికి రూ.15వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది.
బీసీల సంక్షేమాభివృద్ధికి రూ.75వేల కోట్లు ఖర్చుచేస్తామని. సమగ్ర బీసీ ఉప ప్రణాళిక చట్టాన్ని తెస్తామని. శాశ్వత ప్రాతిపదిక బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని ఏలూరులో జరిగిన బీసీ గర్జనలో వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ ప్రకటించారు.
తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తీరు అద్భుతమని.. మిషన్‌ భగీరథ బృహత్తర పథకమని 15వ ఆర్థిక సంఘం సభ్యులు కొనియాడారు.
తెలంగాణ రాష్ట్రంలో వాహనాలు వెల్లువెత్తున్నాయి. గత అయిదేళ్లలో 8.16 రెట్లకు మించి పెరిగాయి. రాష్ట్ర జనాభాలో ప్రతి 5.92 మందికి ఒక వాహనం ఉన్నట్లుగా రవాణాశాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
నీటి కొరత సమస్య వేగంగా తరుముకొస్తూ.. ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయని, నీటి వనరులను పొదుపుగా వాడుకోకపోతే ముప్పుతప్పదని కేంద్ర జల సంఘం హెచ్చరిస్తోంది. ప్రపంచ జనాభాలో 18% మన దేశంలోనే ఉండగా, అందుబాటులో ఉన్న నీటి వనరులు కేవలం 4 శాతమేనని పేర్కొంది,
పుల్వామాలో జరిగిన ముష్కర దాడి ఒక్కడు మాత్రమే చేసింది కాదని.. దాని వెనుక చాలా మంది  హస్తం ఉందని రీసర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా) మాజీ అధిపతి విక్రమ్‌ సూద్‌ పేర్కొన్నారు. మన దేశానికి పాకిస్థాన్‌ కన్నా చైనా నుంచి ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని ఆయన చెప్పారు.
పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్‌లో సైనిక వాహనశ్రేణిపై ఆదివారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో 9 మంది పాక్‌ సైనికులు చనిపోగా, 11 మంది గాయపడ్డారు.
భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 992 పాయింట్లతో బ్యాట్స్‌మెన్‌ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పుజారా (881) మూడో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆసీస్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్నాడు. 

పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.
సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.

  • SCHOOL ASSEMBLY:18th February(చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట)
  • SCHOOL ASSEMBLY:18th February(వార్తలలోని ముఖ్యాంశాలు)

  • School Assembly 18th February Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,February month school assembly day wise,February 2019 school assembly,February 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 18th February 2019 assembly, 18th February 2019 assembly,news of the day history,news of the day highlights,18th dec 2019 assembly, dec 18th assembly, dec 18th historical events, 18th February 2019 assembly, February 18th assembly, February 18th historical events,school related today assembly,school related today news, school related February 18th information, school related February month information, School Assembly 18th Feb Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,Feb month school assembly day wise,Feb 2019 school assembly,Feb 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 18th Feb 2019 assembly, 18th Feb 2019 assembly,news of the day history,news of the day highlights,18th dec 2019 assembly, dec 18th assembly, dec 18th historical events, 18th Feb 2019 assembly, Feb 18th assembly, Feb 18th historical events,school related today assembly,school related today news, school related Feb 18th information, school related Feb month information

    Previous
    Next Post »
    0 Komentar