Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 1st March Information


పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....

School Assembly 1st March Information


చరిత్రలో ఈరోజు
2008: బంగ్లాదేశ్తో చిట్టగాంగ్లో జరుగిన టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్లు మెంకంజీ, జి.సి.స్మిత్‌లు తొలి వికెట్టుకు 415 పరుగులు జోడించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు.
ఆంధ్ర రాష్ట్ర ప్రథమ శాసనసభ స్పీకర్ నల్లపాటి వెంకటరామయ్య 1901 వ సం.లో జన్మించారు.
సుప్రసిద్ధ సాహిత్యవేత్త మరియు పరిశోధకులు ఖండవల్లి లక్ష్మీరంజనం 1908 వ సం.లో జన్మించారు.
ప్రముఖ తెలుగు రంగస్థల నటీమణి ఆవేటి పూర్ణిమ 1918 వ సం.లో జన్మించారు.
బహు గ్రంథకర్త, శతాధిక విమర్శనాత్మక వ్యాస రచయిత, సుప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త, ప్రముఖ విమర్శకులు వెలమల సిమ్మన్న 1955 వ సం.లో జన్మించారు.
స్వాతంత్ర్య సమర యోధుడు యలమంచిలి వెంకటప్పయ్య 1997 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
జాతీయ గేయము
బంకించంద్ర ఛటర్జీ రచించిన 'వందే మాతరం' గీతం భారత జాతీయ గేయం. ఇది బంకించంద్ర ఛటర్జీ రచించిన 'ఆనంద మర్' అనే బెంగాలీ నవలలోనిది. స్వాతంత్రోద్యమ కాలంలో ఈ గీతాన్ని భారతీయులు విప్లవగీతంగా గానం చేశారు. ఇది 'జనగణమన' తో సమానమైన స్థాయి కల్గి ఉంటుంది. వందేమాతర గీతం ప్రప్రథమంగా 1896లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఆలపించబడింది.
మంచి మాట /సుభాషితం:
వర్షానికి భయపడి పక్షులన్నీ గూటిని వెతుక్కుంటాయి, గద్ద మాత్రం మేఘాల పై వైపు ఎగురుతుంది, విజేత ఆలోచన తీరు అలానే ఉంటుంది- అబ్దుల్‌ కలాం


వార్తలలోని ముఖ్యాంశాలు
భారత్‌ సహా అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిడికి పాకిస్థాన్‌ దిగొచ్చింది. తమ వద్ద బందీగా ఉన్న భారత వైమానిక దళం వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను విడిచిపెట్టేందుకు అంగీకరించింది.
పాకిస్థాన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడితే తిప్పికొట్టడానికి తాము సర్వసన్నద్ధంగా ఉన్నట్లు భారత త్రివిధ దళాలు స్పష్టంచేశాయి.
విశాఖ రైల్వే మైదానంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించనున్న ప్రధాని నరేంద్రమోదీ ప్రజా చైతన్య సభకు  భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ తదితర ప్రత్యేక దళాలను కూడా రంగంలోకి దింపారు.
గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించే లక్ష్యం తో ఆయా ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు అధిక మొత్తంలో ఆర్థిక ప్రయోజనాలు కలుగజేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలంగాణ వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు.
2025 కల్లా 65 లక్షల ఉద్యోగాలను సృష్టించడంతో పాటు సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తుల అభివృద్ధి కేంద్రంగా భారత్‌ను నిలపడం కోసం సాఫ్ట్‌ వేర్‌ ఉత్పత్తులపై ఒక జాతీయ విధానానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది.
సంస్కరణల అజెండాను సమర్థంగా అమలు చేసి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 'ఈజ్‌' (ఎన్‌హాన్స్‌డ్‌ యాక్సెస్‌, సర్వీస్‌ ఎక్సలెన్స్‌) సూచీలో 100 పాయింట్లకు గాను 78.4 పాయింట్లు పొంది మొదటి స్థానాన్ని దక్కించుకుంది.
భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధికి సంబంధించి అక్టోబర్‌డిసెంబర్‌ (మూడవ త్రైమాసికం) కాలంలో వృద్ధిరేటు కేవలం 6.6 శాతంగా నమోదయ్యింది. గడచిన ఐదు త్రైమాసికాల్లో (15 నెలలు) ఇంత తక్కువ స్థాయి వృద్ధి నమోదుకావడం ఇదే తొలిసారి.
మక్రన్‌ కప్‌ బాక్సింగ్‌ టోర్నీలో తెలుగు బాక్సర్‌ లలిత ప్రసాద్‌ (52 కేజీలు) రజతం సొంతం చేసుకున్నాడు. మరోవైపు జాతీయ ఛాంపియన్‌ దీపక్‌ సింగ్‌ (49 కేజీలు) పసిడి, మనీశ్‌ కౌశిక్‌ (60 కేజీలు), దుర్యోధన్‌ సింగ్‌ (69 కేజీలు), సంజీత్‌ (91 కేజీలు), సతీశ్‌ కుమార్‌ (91 కేజీల పైనా) వెండి పతకాలతో సరిపెట్టుకున్నారు.
ఉత్కంఠభరితంగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 2 వికెట్ల తేడాతో భారత మహిళా జట్టును ఓడించింది. తొలి రెండు వన్డేలను గెలిచిన భారత్‌ ఈ సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.


School Assembly 1st March Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,March month school assembly day wise,March 2019 school assembly,March 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 1st March 2019 assembly, 1st March 2019 assembly,news of the day history,news of the day highlights,1st dec 2019 assembly, dec 1st assembly, dec 1st historical events, 1st March 2019 assembly, March 1st assembly, March 1st historical events,school related today assembly,school related today news, school related March 1st information, school related March month information, historical events in india,historical events in march,historical events around the world in march,historical events and dates,historical events around the world,a historical event in india,a historical event that happened today,a history event in india,current and historical events,dates and historical events,historical events by date,historical events calendar,historical events dates,historical events date wise,historical events march,historical events march 1st,historical events happened in march month,historical events happened today,historical events happening now,historical events pdf,historical events related to education,historical events that happened today,historical events wikipedia,historical events with dates pdf,a-z historical events
Previous
Next Post »
0 Komentar