Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 20th February Information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....
School Assembly 20th February Information

నేటి ప్రాముఖ్యత
ప్రపంచ సామాజిక న్యాయ దినం
మిజోరామ్, అరుణాచల్‌ప్రదేశ్ అవతరణ దినం
చరిత్రలో ఈరోజు
ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలంగాణా ప్రాంతాన్ని కలిపి ఆంధ్ర ప్రదేశ్ గా ఏర్పాటు చేయటానికి ముందుగా, 1956 ఫిబ్రవరి 20 నాడు పెద్ద మనుషుల ఒప్పందం కుదిరింది.
సంస్కృత వాజ్మయచరిత్ర రాసిన మల్లాది సూర్యనారాయణ 1880 వ సం.లో జన్మించారు.
బొబ్బిలి రాజవంశానికి చెందిన 13వ రాజు రామకృష్ణ రంగారావు 1901 వ సం.లో జన్మించారు.
జీవరసాయన శాస్త్రము, పౌష్టికాహారం, ఫార్మాన్యూటికల్స్ రంగాలలో ఎంతో విలువైన పరిశోధనలు జరిపిన గొల్లకోట బుచ్చిరామశర్మ 1915 వ సం.లో జన్మించారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థనరెడ్డి 1935 వ సం.లో జన్మించారు.
తెలుగు సినిమా మరియు రంగస్థలనటుడు, సినీనిర్మాత, దర్శకుడు, హాస్య నటుడు బి.పద్మనాభం 2010 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
ప్రమాదాలను సూచించడానికి ఎరుపురంగునే ఎందుకు వాడతారు ?
ఎరుపు రంగు వాడడానికి కారణం ఆ రంగుకు ఒక ప్రత్యేక లక్షణం ఉంది. అదేంటంటే కంటికి కనిపించే అన్ని రంగులకన్నా ఎరుపు రంగుకు ఎక్కువ 'తరంగ దైర్ఘ్యం' ఉంటుంది. రంగులన్నీ తరంగాల రూపంలో ప్రసారమవుతూ ఉంటాయి. నిశ్చలంగా ఉన్న నీటిలో చిన్నరాయిని వదిలితే చిన్న తరంగాలు, పెద్ద రాయిని జారవిడిస్తే పెద్ద తరంగాలు ఏర్పడినట్లు, చిన్న తరంగాలకు తక్కువ తరంగదైర్యం, పెద్ద తరంగాలకు ఎక్కువ తరంగదైర్యం ఉంటుంది. రంగులు కనిపించే విషయంలో కూడా ఇదే లక్షణం వర్తిస్తుంది. ఎక్కువ తరంగదైర్యమున్న ఎరుపురంగు ఎక్కువ దూరం కనిపిస్తుంది. అందువల్లే ప్రమాద సూచికగా ఎరుపురంగును వాడతారు. "
మంచి మాట /సుభాషితం:
గొప్ప ఆరోగ్య రహస్యం ఏమిటంటే ఆనందంగా పనిచేయడమే- సరోజినీ నాయుడు
వార్తలలోని ముఖ్యాంశాలు
తిరుమల, తిరుపతి దేవస్థానం 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.3,116.25 కోట్లతో బడ్జెట్‌ను ఆమోదించింది. ఇందులో ప్రధానంగా హుండీ ద్వారా రూ.1,231 కోట్లు, డిపాజిట్లపై వడ్డీ రూపేణా రూ.845.86 కోట్లు ఆదాయం వస్తుందనే అంచనా వేసింది.
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2018లో జారీచేసిన ఇనాం భూముల ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంగళవారం ఆమోదముద్ర వేశారు. ఫలితంగా 1956 నుంచి 2013 వరకు జరిగిన ఇనాం భూముల కొనుగోళ్లు, అమ్మకాలపై ఉన్న నిషేధం తొలగి లక్షల మందికి ఉపశమనం కలుగనుంది.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ రాజ్‌భవన్‌లో ఘనంగా జరిగింది. ఈటల రాజేందర్‌కు వైద్యఆరోగ్యశాఖ, జగదీశ్‌రెడ్డికి విద్యాశాఖ, నిరంజన్‌రెడ్డికి వ్యవసాయం, ఎర్రబెల్లి దయాకర్‌రావుకు పంచాయతీరాజ్‌, వి.శ్రీనివాస్‌గౌడ్‌కు ఎక్సైజ్, యువజన శాఖ, వేముల ప్రశాంత్‌రెడ్డికి రవాణా శాఖ, ఇంద్రకరణ్‌ రెడ్డికి అటవీ, పర్యావరణ శాఖ, తలసాని శ్రీనివాస్‌యాదవ్ కు పశు సంవర్ధక , సినిమా టో గ్రఫీ, మల్లారెడ్డి కి కార్మిక, ఉపాది, స్త్రీ శిశుసంక్షేమ శాఖ, కొప్పుల ఈశ్వర్ కు ఎస్సీ, ఎస్టి , బిసి సంక్షేమ శాఖలు దక్కాయి.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రత్యేకంగా ఉన్నాయని 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ ఎన్‌.కె.సింగ్‌ ప్రశంసించారు. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి రక్షిత మంచినీరు అందించే ప్రయత్నాన్ని అభినందించారు.
తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల కోసం అధికార అన్నాడీఎంకే, భాజపాల మధ్య పొత్తు కుదిరింది. పట్టాలి మక్కల్‌ కట్చి (పీఎంకే) కూడా ఈ కూటమితో జత కట్టింది.
పుల్వామా ఉగ్రదాడిలో తమ హస్తం ఉందన్న భారత్‌ వాదనను పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఖండించారు. భారత్‌ దాడి చేస్తే, మేం ఆలోచిస్తూ కూర్చోబోమని, ప్రతిదాడి తప్పదని హెచ్చరించారు.
మెక్సికోతో సరిహద్దుల్లో గోడ నిర్మాణానికి నిధులు రాబట్టుకోవడం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జాతీయ అత్యయిక స్థితి ప్రకటించారు. ట్రంప్‌ చర్యను తప్పుపడుతూ 16 రాష్ట్రాలు శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో దావా వేశాయి.
ఐపీఎల్‌-12 తొలి రెండు వారాల షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించలేదు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. మార్చి 24న కోల్‌కతాతో, మార్చి 29న రాజస్థాన్‌ రాయల్స్‌తో, మార్చి 31న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో, ఏప్రిల్‌ 4న దిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.

పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.
సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.

  • SCHOOL ASSEMBLY:20th February(చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం)
  • SCHOOL ASSEMBLY:20th February(వార్తలలోని ముఖ్యాంశాలు)

  • School Assembly 20th February Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,February month school assembly day wise,February 2019 school assembly,February 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 20th February 2019 assembly, 20th February 2019 assembly,news of the day history,news of the day highlights,20th dec 2019 assembly, dec 20th assembly, dec 20th historical events, 20th February 2019 assembly, February 20th assembly, February 20th historical events,school related today assembly,school related today news, school related February 20th information, school related February month information, School Assembly 20th Feb Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,Feb month school assembly day wise,Feb 2019 school assembly,Feb 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 20th Feb 2019 assembly, 20th Feb 2019 assembly,news of the day history,news of the day highlights,20th dec 2019 assembly, dec 20th assembly, dec 20th historical events, 20th Feb 2019 assembly, Feb 20th assembly, Feb 20th historical events,school related today assembly,school related today news, school related Feb 20th information, school related Feb month information
    Previous
    Next Post »
    0 Komentar