Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 21st February Information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....
School Assembly 21st February Information


నేటి ప్రాముఖ్యత
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
చరిత్రలో ఈరోజు
1804 స్టీమ్ ఇంజన్ తో నడిచే రైలు వేల్స్ లో మొదటిసారి ప్రయాణించింది.
ప్రసిద్ధ శాస్త్రవేత్త  శాంతిస్వరూప్ భట్నాగర్ 1894 వ సం.లో జన్మించారు.
ప్రముఖ సైన్సు రచయిత, శాస్త్రవేత్త, భౌతిక శాస్త్ర విజ్ఞాన ప్రచార యోధాగ్రణి వసంతరావు వేంకటరావు 1909 వ సం.లో జన్మించారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి, హేతువాది, జంతుశాస్త్ర నిపుణుడు డా.దేవరాజు మహారాజు 1951 వ సం.లో జన్మించారు.
కెనడాకు చెందిన వైద్యుడు, వైద్య శాస్త్రవేత్త, ఇన్సులిన్ సహ ఆవిష్కర్త మరియు నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రెడరిక్ బాంటింగ్ 1941 వ సం.లో మరణించారు.
ప్రసిద్ధ రంగస్థల నటుడు స్థానం నరసింహారావు 1971 వ సం.లో మరణించారు.
కనక్ ప్రవాసి అనే కలం పేరుతో తెలుగు సాహిత్య లోకానికి సుపరిచితుడు చామర్తి కనకయ్య 2010 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
తుమ్ము మంచిదే ..!
ఏదైనా అలర్జీని కలిగించే పదార్ధం మన శరీరంలోకి వెళ్లినప్పుడు దాన్ని బయటికి పంపేందుకు మన శరీరం చేసుకున్న ఏర్పాటే తుమ్ము, ఇది గొంతు, ఛాతీ, డయాఫ్రం, అబ్డామిన్లకు మంచి వ్యాయామం, ముక్కులో ఉన్న దుమ్ము, ధూళిని బయటికి నెట్టేస్తుంది. అంటే ఓ రకంగా తుమ్ము మంచిదే. తుమ్మును బలవంతంగా ఆపితే.. కన్ను, మెదడులోని రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదముంది. అలాగే చెవి కూడా దెబ్బతింటుంది. కాబట్టి తుమ్ము వస్తే తుమ్మేయడమే మంచిది.
మంచి మాట /సుభాషితం:
ఉన్నను లేకున్నను పై
కెన్నడు మర్మంబుఁ దెలుప నేగకుమీ నీ
కన్నతలిదండ్రుల యశం
బెన్నఁబడెడు మాడ్కిఁదిరుగు మెలమిఁగుమారా!
భావం - నీకు ఉన్నా, లేకున్నా సరే ఆ విషయం బయటికి తెలియనియ్యకు. ఎప్పుడైనా నీకు రహస్యాలు తెలిస్తే, వాటిని ఇతరులకు చెప్పే ప్రయత్నం చేయకు. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కీర్తి దశదిశలా వ్యాపించేలా చేయి.

వార్తలలోని ముఖ్యాంశాలు
తహసీల్దార్‌ హోదాలో పర్యాటకశాఖలో పని చేస్తున్న రాచూరి శివరావు ఇంటితో పాటు, బంధువుల ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ జరిపిన తనిఖీలలో రూ.50 కోట్లు పైగా అక్రమంగా కూడబెట్టిన ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
రాజకీయం రాజకీయమే.. అభివృద్ధి అభివృద్ధే.. ఈ విషయంలో ఎవరూ లేనిపోని అహాలకు పోకుండా కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేయాలని ఉపరాష్ట్రపతి   ఎం.వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.
సిద్దిపేట మండలంలోని జి.ఎల్లయ్య అనే రైతు కల్తీ విత్తనాల కంపెనీపై ఎనిమిదేళ్లుగా పోరాడి విజయం సాధించారు. రైతుకు మొత్తం రూ.2.91 లక్షలు చెల్లించాలంటూ సంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం సదరు విత్తన కంపెనీని ఆదేశించింది.
లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే మండల, జిల్లా పరిషత్‌ మరియు పురపాలక ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం మాదిరిగానే కొత్త పురపాలక చట్టాన్ని తెచ్చేందుకు సన్నాహాలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఎరిక్‌సన్‌ కేసులో ఆర్‌కామ్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని నాలుగు వారాల్లోగా రూ.453 కోట్లు చెల్లించకపోతే మూడు నెలల పాటు జైలు శిక్ష విధించాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు హెచ్చరించింది.
ఆంధ్రా బ్యాంక్‌తో పాటు మరో 11 బ్యాంకులకు కలిపి మొత్తంగా రూ.48,239 కోట్లను మూలధన సాయం కింద కేంద్రప్రభుత్వం అందజేయనుంది. ఇదిలావుండగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా లో దేనా బ్యాంక్‌, విజయా బ్యాంక్‌ల విలీనం ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది.
ఉగ్రవాదం ఆందోళన కలిగించే అంశమని దీనిని ఎదుర్కోవడానికి భారత్‌, ఇతర పొరుగు దేశాలకు సహాయం అందిస్తామని సౌదీ అరేబియా సింహాసనాన్ని అధిష్ఠించనున్న యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అభిప్రాయపడ్డారు. .
నేటి నుంచి వేర్వేరు వేదికల్లో టి20 టోర్నమెంట్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ మ్యాచ్‌లు జరుగుతాయి. మార్చి 14న ఫైనల్‌ నిర్వహిస్తారు. గత కొన్నేళ్లుగా కుర్రాళ్లు సత్తా చాటి ఐపీఎల్‌లో అవకాశం దక్కేందుకు ఈ టోర్నీ వేదికగా ఉపయోగపడింది.


పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.
సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.


  • SCHOOL ASSEMBLY:21st February(నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం)
  • SCHOOL ASSEMBLY:21st February(వార్తలలోని ముఖ్యాంశాలు)


  • School Assembly 21st February Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,February month school assembly day wise,February 2019 school assembly,February 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 21st February 2019 assembly, 21st February 2019 assembly,news of the day history,news of the day highlights,21st dec 2019 assembly, dec 21st assembly, dec 21st historical events, 21st February 2019 assembly, February 21st assembly, February 21st historical events,school related today assembly,school related today news, school related February 21st information, school related February month information, School Assembly 21st Feb Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,Feb month school assembly day wise,Feb 2019 school assembly,Feb 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 21st Feb 2019 assembly, 21st Feb 2019 assembly,news of the day history,news of the day highlights,21st dec 2019 assembly, dec 21st assembly, dec 21st historical events, 21st Feb 2019 assembly, Feb 21st assembly, Feb 21st historical events,school related today assembly,school related today news, school related Feb 21st information, school related Feb month information
    Previous
    Next Post »
    0 Komentar