Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 23rd February Information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....
School Assembly 23rd February Information


చరిత్రలో ఈరోజు
మొదటి వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు అన్నమయ్య 1503 వ సం.లో మరణించారు.
2009: 91వ అకాడమీ అవార్డులలో భారతదేశానికి చెందిన ఏ.ఆర్.రెహమాన్కు రెండు ఆస్కార్ అవార్డులు లభించాయి.
మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ 1483 వ సం.లో జన్మించారు.
వేదమూర్తులు, సంస్కృతాంధ్ర భాషా ప్రవీణులు, ఉపన్యాస కేసరి, హిందూ ధర్మ పరిరక్షణా కంకణ దీక్షాపరులు నూజిళ్ళ లక్ష్మీనరసింహం 1931 వ సం.లో జన్మించారు.
1954 సద్గురు బాబా హరదేవ్ సింగ్ మహరాజ్ జన్మదినం.
బ్రిటీష్ రచయిత జాన్ కీట్స్  1821 వ సం.లో మరణించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ క్విన్సీ ఆడమ్స్ 1848 వ సం.లో మరణించారు.
సాంఘిక బహిష్కరణల వంటి దురాచారాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి, పోరాటాలు సాగించిన తవనం చెంచయ్య 2014 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
పండ్లు ఎప్పుడు తినాలి?
                  అన్నం తిన్న తర్వాత పండ్లు తినడం కంటే అన్నం తినే అరగంట ముందో లేక భోజనం తర్వాత అరగంటకో పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. అదే విధంగా మార్కెట్ నుంచి తెచ్చిన పండ్లు శుభ్రంగా కడిగిన తర్వాతే పండ్లు తినాలి. వ్యాయామానికి ముందు పండ్లు తీసుకుంటే శరీరం అలిసి పోకుండా ఉంటుంది. పండ్లముక్కలపై ఉప్పు చల్లి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా పులుపు ఉన్న పండ్లపై ఉప్పు చల్లుకుని తింటే అజీర్ణ సమస్యలు రావు. కర్బూజ, పుచ్చకాయల్లాంటి పండ్లు తింటే ఆకలి అదుపులో ఉంటుంది.
మంచి మాట /సుభాషితం:
విజయం అంతిమ లక్ష్యమూ కాదు, ఓటమే అంతిమమూ కాదు, రెండుసార్లూ ఎంత సమతూకంగా ఉండగలుగుతున్నామన్నదే మనలోని బలానికి నిదర్శనం - అబ్రహాం లింకన్‌


వార్తలలోని ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పనపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విస్పష్టమైన హామీ ఇచ్చారు. కేంద్రంలో తాము అధికారంలో వస్తే  రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ హామీ నెరవేరుస్తామని  ప్రకటించారు.
సమాజ సేవను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని పనిచేయాలని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పిలుపునిచ్చారు. మన ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన సమాజానికి తిరిగి సేవ చేయాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలని సూచించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2019-20 ఆర్థిక సంవత్సరానికి శాసనసభలో రూ.1.82 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇది ఆరు నెలల కాలానికి ఓట్‌ ఆన్‌అకౌంట్‌ బడ్జెట్‌ కావడంతో ఇందులో సగం మొత్తానికి ద్రవ్యవినిమయ బిల్లును శాసనసభ ఆమోదిస్తుంది.
శతాధిక చిత్రాల దర్శకుడిగా తెలుగు చిత్రసీమపై తనదైన ముద్ర వేసిన కోడి రామకృష్ణ(63) అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. 
ప్రపంచ శాంతికి ఉగ్రవాదమే పెద్ద ముప్పు అని, దీన్ని సమూలంగా నాశనం చేయడానికి అన్ని దేశాలు ఏకమయి, కార్యాచరణ చేపట్టాల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పిలుపునిచ్చారు.
భారతీయ సైన్యానికి మరో మూడు ధ్రువ అధునాతన తేలికపాటి హెలికాప్టర్లను (ఏఎల్‌హెచ్‌లను) బెంగళూరులోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) అందజేసింది. పూర్తిగా స్వదేశీది పరిజ్ఞానం తో తయారైన ఈ హెలికాప్టర్లు యుద్ధ విమానం మాదిరిగానే పని చేస్తుంది.
ఇంగ్లాండ్‌తో మూడు మహిళల వన్డేల సిరీస్‌లో భారత్‌ బోణీ కొట్టింది. శుక్రవారం తొలి వన్డేలో మిథాలీ బృందం 66 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. 49.4 ఓవర్లలో 202 పరుగులు చేసింది.
ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో భారత్‌ ఆడకూడదన్న ఆలోచనను క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ వ్యతిరేకించాడు. పాక్‌తో మ్యాచ్‌ను బహిష్కరించే బదులు ఆడి ఆ జట్టును ఓడించడం మంచిదన్న గావస్కర్‌ అభిప్రాయంతో అతడు ఏకీభవించాడు.


పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.
సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.


  • SCHOOL ASSEMBLY:23rd February(చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం)
  • SCHOOL ASSEMBLY:23rd February(వార్తలలోని ముఖ్యాంశాలు)

  • School Assembly 23th February Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,February month school assembly day wise,February 2019 school assembly,February 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 23th February 2019 assembly, 23th February 2019 assembly,news of the day history,news of the day highlights,23th dec 2019 assembly, dec 23th assembly, dec 23th historical events, 23th February 2019 assembly, February 23th assembly, February 23th historical events,school related today assembly,school related today news, school related February 23th information, school related February month information, School Assembly 23th Feb Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,Feb month school assembly day wise,Feb 2019 school assembly,Feb 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 23th Feb 2019 assembly, 23th Feb 2019 assembly,news of the day history,news of the day highlights,23th dec 2019 assembly, dec 23th assembly, dec 23th historical events, 23th Feb 2019 assembly, Feb 23th assembly, Feb 23th historical events,school related today assembly,school related today news, school related Feb 23th information, school related Feb month information
    Previous
    Next Post »
    0 Komentar