Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 26th February Information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....
School Assembly 26th February Information

నేటి ప్రాముఖ్యత
కువైట్ విముక్తి దినం.
చరిత్రలో ఈరోజు
1975 : భారత్ లో మొదటి గాలిపటాల మ్యూజియం శంకర కేంద్రను అహ్మదాబాదులో ప్రారంభం.
1993: అలాన్ బోర్డర్ టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా సునీల్ గవాస్కర్ రికార్డును అధికమించాడు.
సుప్రసిద్ధ ఫ్రెంచి నవలా రచయిత, కవి, నాటక రచయిత, వ్యాస కర్త విక్టర్ హ్యూగో 1802 వ సం.లో జన్మించారు.
బ్లూ జీన్స్ ని రూపొందించిన తొలి సంస్థ లెవీ స్ట్రాస్ అండ్ కో సంస్థ స్థాపకుడు  లెవీ స్ట్రాస్ 1829 వ సం.లో జన్మించారు.
పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి మహిళా వైద్యురాలు ఆనందీబాయి జోషి 1887 వ సం.లో మరణించారు.
ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు అయ్యదేవర కాళేశ్వరరావు 1962 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
సెల్ ఫోన్ ఎలా పనిచేస్తుంది ?
                    ల్యాండ్ ఫోన్ వైర్ల సాయంతో పనిచేస్తే సెల్ ఫోన్ గాలి ఆధారంగా పనిచేస్తుంది. ఒక్కముక్కలో చెప్పాలంటే సెల్ ఫోన్ అంటే అత్యాధునిక రీతిలో అభివృద్ధి చేసిన ఒక రేడియో. టవర్స్ లేనిదే సెల్ ఫోన్ పనిచేయదు. ఎందుకంటే గాలిలోని శబ్దతరంగాలను రేడియో టవర్స్ సెల్ సాయంతో మాటలుగా మార్చి, ఒకచోటు నుంచి మరో చోటుకి చేరవేస్తుంటాయి. మనిషి తలలోని మెదడులా సెల్ ఫోన్లోని సర్క్యూట్ మనం నంబర్ల ప్రకారం ప్రత్యేకంగా ఏర్పరచుకున్న అమరిక ద్వారా సమాచారాన్ని ఒక సెల్ నుంచి మరో సెల్ కి చేరవేస్తుంది.
మంచి మాట /సుభాషితం:
విజయాన్ని అందించేది మనలోని సామర్థ్యం, దాన్ని నిలపగలిగేది మన నడవడిక- రూసో
వార్తలలోని ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ముదిరాజ్‌, నగరాలు/నాగవంశ, కల్లు-నీరా గీత కార్మికుల సహకార ఆర్థిక సంస్థల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అలాగే రూ.10వేల లోపు డిపాజిట్‌ చేసిన అగ్రిగోల్డ్‌ బాధితులకు వెంటనే చెల్లింపులు ప్రారంభించాలని ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్  రాష్ట్రవ్యాప్తంగా ఎండ వేడిమి పెరుగుచున్నది. ఇంతటి తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు గత పదేళ్లలో 2009లో ఒకసారి, 2012లో మరోసారి ఫిబ్రవరి నెలలోనే కనిపించాయి.
రాష్ట్ర ప్రజలకు నూటికి నూరు శాతం మేలు చేసే పాలనను అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు కూడా ఉంటాయని ప్రకటించారు.
2019 ఆస్కార్‌ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా 'గ్రీన్‌బుక్‌, ఉత్తమ దర్శకుడిగా  'రోమా' చిత్ర దర్శకుడు 'అల్ఫాన్సో కారన్‌'కు; ఉత్తమ నటుడిగా  'బొహెయిమెన్‌ రాప్సోడీ' చిత్రంలో నటించిన 'రామి మలేక్‌' కు; 'ద ఫేవరెట్‌' సినిమాలో నటించిన 'ఒలివియా కామన్‌'కు ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు. 
2019 ఆస్కార్‌ అవార్డుల్లో బొహెమియన్‌ రాప్సొడీచిత్రానికి అత్యధికంగా నాలుగు ఆస్కార్‌లు అందాయి. తర్వాతి స్థానంలో మూడు పురస్కారాలతో రోమా’, ‘గ్రీన్‌బుక్‌’, ‘బ్లాక్‌పాంథర్‌ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. స్వాతంత్య్రానంతరం వివిధ యుద్ధాల్లోనూ, శాంతి పరిరక్షణ దళాల్లోనూ ఉంటూ మరణించిన 25,942 మంది  అమర వీరుల పేర్లను ఈ స్మారకంపై సువర్ణాక్షరాలతో లిఖించారు.
అసోంలో కల్తీ సారా తాగి మృతి చెందిన వారి సంఖ్య 159కి చేరుకుంది. మరో 250మంది వరకు ఆసుప్రతుల్లో చికిత్స పొందుతున్నారు. రోజు రోజుకీ మరణాలు పెరుగుతున్నప్పటికీ ఆయా ప్రాంతాల్లో కల్తీ సారా అమ్మకాలు మాత్రం ఆగడం లేదు.
భారత మహిళల క్రికెట్‌ జట్టు తొలి వన్డేలో లాగే రెండో మ్యాచ్‌లోనూ సమష్టిగా సత్తా చాటి ఇంగ్లాండ్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి.. మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.

పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.
సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.

  • SCHOOL ASSEMBLY:26th February(నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం)
  • SCHOOL ASSEMBLY:26th Februaryవార్తలలోని ముఖ్యాంశాలు()


  • School Assembly 26th February Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,February month school assembly day wise,February 2019 school assembly,February 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 26th February 2019 assembly, 26th February 2019 assembly,news of the day history,news of the day highlights,26th dec 2019 assembly, dec 26th assembly, dec 26th historical events, 26th February 2019 assembly, February 26th assembly, February 26th historical events,school related today assembly,school related today news, school related February 26th information, school related February month information, School Assembly 26th Feb Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,Feb month school assembly day wise,Feb 2019 school assembly,Feb 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 26th Feb 2019 assembly, 26th Feb 2019 assembly,news of the day history,news of the day highlights,26th dec 2019 assembly, dec 26th assembly, dec 26th historical events, 26th Feb 2019 assembly, Feb 26th assembly, Feb 26th historical events,school related today assembly,school related today news, school related Feb 26th information, school related Feb month information
    Previous
    Next Post »
    0 Komentar